వరుసగా మూడో నెలలోనూ దెబ్బ

9 Feb, 2019 08:31 IST|Sakshi

జనవరిలో 2,80,125 వాహన అమ్మకాలు

క్రితం ఏడాది ఇదే కాలంతో  పోలిస్తే 2 శాతం తక్కువ

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగంలో గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి నెలలోనూ ప్రయాణికుల వాహనాల్లో 2 శాతం క్షీణత నమోదైంది. వరుసగా మూడో నెలలోనూ డిమాండ్‌ క్షీణించింది. దీంతో మొత్తం 2,80,125 వాహనాలు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం సియామ్‌ తెలిపింది. పండుగ సీజన్‌లో అమ్మకాలు ఆశించినంత లేకపోవడంతో నిల్వలను తగ్గించుకోవడంపై తయారీదారులు దృష్టి పెట్టినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జనవరిలో అమ్ముడైన వాహనాలు 2,85,467 యూనిట్లుగా ఉన్నాయి. 

కార్ల విక్రయాలు వరుసగా మూడో నెలలోనూ తగ్గాయి. క్రితం ఏడాది జనవరితో పోలిస్తే 2.65% తగ్గి 1,79,389 యూనిట్లుగా ఉన్నాయి.  మారుతి సుజుకి ప్యాసింజర్‌ వాహన విక్రయాలు జనవరిలో 0.18 శాతమే పెరిగాయి. 1,39,440 వాహనాలను ఈ సంస్థ విక్రయించింది. ప్యాసింజర్‌ కార్ల అమ్మకాల వరకే చూస్తే 1,01,865 యూనిట్లుగా ఉన్నాయి.

  • ఇది క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 4 శాతం తక్కువ.
  • హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కార్ల అమ్మకాలు 1.58% తగ్గి 35,439 యూనిట్లుగా ఉన్నాయి. 
  • మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 0.88 శాతం వృద్ధితో 23,864 యూనిట్లుగా ఉన్నాయి. 
  • హోండా కార్లు మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 52 శాతం పెరిగాయి. 14,383 కార్లను విక్రయించింది. 
  • ద్విచక్ర వాహన విక్రయాలు జనవరిలో 5.18 శాతం తగ్గి 15,97,572 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్‌ తెలిపింది.
  • మోటారు సైకిళ్ల వరకే చూసినా 2.55 శాతం క్షీణతతో 10,27,810 యూనిట్లుగా ఉండడం  గమనార్హం. 
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రేడ్‌ వార్‌  భయాలు : స్టాక్‌మార్కెట్ల పతనం

బంగారు బాట ఎటు..?

ప్రీమియం బైక్‌కు బీమా అప్‌గ్రేడ్‌

మోస్తరు రిస్క్‌... రాబడులు ఎక్కువ!

పెరగనున్న హోండా కార్ల ధరలు

రిలయన్స్‌ ఔట్‌.. ఫండ్స్‌పై ప్రభావం ఉంటుందా?

కుప్పకూలుతున్న అడాగ్‌ షేర్లు

విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌గా యశ్ బిర్లా సూర్య

ఫ్లాట్‌ ప్రారంభం : అమ్మకాల ఒత్తిడి

వన్‌ప్లస్‌కి ఝలక్‌ : వరల్డ్స్‌ ఫాస్టెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌

పెద్ద టీవీలకు క్రికెట్‌ జోష్‌!

అమెరికా వస్తువులపై సుంకాల పెంపు

వారికి భారీ జీతాలు సమంజసమే - టీసీఎస్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌: మరో షాకింగ్‌ న్యూస్‌

చివర్లో భారీగా అమ్మకాలు

‘వ్యాగన్‌ఆర్‌ బీఎస్‌–6’ వెర్షన్‌

అమెరికా దిగుమతులపై భారత్‌ సుంకాలు

ప్రకటనలు చూస్తే పైసలొస్తాయ్‌!!

ఈ ఫోన్‌ ఉంటే టీవీ అవసరం లేదు

జెట్‌ సమస్యలు పరిష్కారమవుతాయ్‌!

9న టీసీఎస్‌తో ఫలితాల బోణీ

వాణిజ్యలోటు గుబులు

పండుగ సీజనే కాపాడాలి!

ఎన్‌డీటీవీ ప్రణయ్‌రాయ్‌పై సెబీ నిషేధం

కిర్గిజ్‌తో పెట్టుబడుల ఒప్పందానికి తుదిరూపు

లీజుకు షి‘కారు’!!

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు

వరస నష్టాలు : 200 పాయింట్ల పతనం

22 నెలల కనిష్టానికి టోకు ధరల సూచీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెట్‌లోనే ఇండియా-పాక్‌ మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

మణిరత్నంకు మరోసారి గుండెపోటు

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌

గర్జించే టైమ్‌ వచ్చింది!

సూర్యకు ధన్యవాదాలు తెలిపిన మోహన్‌ బాబు