హరిద్వార్‌ టు హర్‌ ద్వార్‌

16 Jan, 2018 13:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి తమ దూకుడును మరింత పెంచింది. తన ఉత్పత్తులతో దిగ్గజ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు దడ పుట్టిస్తున్న సంస్థ తాజాగా మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.  ఆన్‌లైన్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు  తెలిపింది. ఇకపై  హరిద్వార్‌ నుంచి హర్‌ ద్వార్‌ దాకా (హరి ద్వారా నుంచి ప్రతి గుమ్మం దాకా)  అని తమ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించనున్నట్టు  వెల్లడించింది. ఈ మేరకు పలు  ప్రముఖ ఇ-రీటైలర్లు , అగ్రిగేటర్లతో తమ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీంతో  ఇక మీదట  ఫ్లిప్‌కార్ట్‌,  బిగ్‌ బాస్కెట్‌ లాంటి  ఇతర  ఈ కామర్స్‌ సైట్‌లలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి యోగా గురు  రాం దేవ్‌ మంగళవారం న్యూఢిల్లీలో కీలక ప్రకటన చేశారు.

పతంజలి ఆయుర్వేద  ఉత్పత్తులు ఇకపై అమెజాన్, ఫ్లిప్‌కార్ల్‌,షాప్‌ క్లూస్‌, బిగ్‌ బాస్కేట్‌, నెట్ మెడ్, వన్‌ ఎంజీ అఫీషియల్‌ ద్వారా  కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు  పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు.  పలు గృహా అవసరాలతోపాటు,  ఆయుర్వేద మందులు, పానీయాలు లాంటి పలు రకాల  ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల సోలార్‌ ఉత్పత్తులపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు  ఈ ఉత్పత్తులు ఇప్పటికే ఇతర విక్రయదారుల ద్వారా అనేక ఆన్లైన్ ప్లాట్‌ ఫాంలలో లభ్యమవుతున్నప్పటికీ ఇపుడిక ఇకపై ఒక క్రమపద్ధతిలో  కస్టమర్ల ముంగిళ్లకు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని వార్తలు