అత్యంత ప్రభావవంతమైన బ్రాండ్స్‌లో..

15 Jul, 2017 01:24 IST|Sakshi
అత్యంత ప్రభావవంతమైన బ్రాండ్స్‌లో..

పతంజలి, రిలయన్స్‌ జియో
న్యూఢిల్లీ: దేశంలో ‘అత్యంత ప్రభావవంతమైన బ్రాండ్స్‌’ జాబితాను గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ ఇప్సార్‌ విడుదల చేసింది. ఇందులో గూగుల్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ నిలిచాయి. రామ్‌దేవ్‌ బాబా ప్రమోట్‌ చేస్తోన్న పతంజలి 4వ స్థానంలో నిలవటం గమనార్హం. ముకేశ్‌ అంబానీ  రిలయన్స్‌ జియో 9వ స్థానంలో ఉంది.

కేవలం ఒకే ఒక ఫైనాన్షియల్‌ సంస్థ ఎస్‌బీఐ మాత్రమే జాబితాలో స్థానం పొందింది. ఇది ఐదో స్థానంలో ఉంది. ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ పదో స్థానంలో, అమెజాన్‌ ఆరో స్థానంలో ఉన్నాయి. శాంసంగ్‌ ఏడో స్థానంలో, ఎయిర్‌టెల్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఇక 11–20 మధ్య ర్యాంకుల్లో స్నాప్‌డీల్, యాపిల్, డెటాల్, క్యాడ్‌బరీ, సోనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, గుడ్‌డే, అమూల్‌ బ్రాండ్స్‌ ఉన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు