పతంజలికి పోటీగా ఆధ్యాత్మిక గురు స్టోర్స్‌

22 Aug, 2017 14:05 IST|Sakshi
పతంజలికి పోటీగా ఆధ్యాత్మిక గురు స్టోర్స్‌
ముంబై : యోగా గురు రాందేవ్‌ బాబా పతంజలి స్టోర్లపై మరో ఆధ్యాత్మిక గురు పోటీకి వస్తున్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ శ్రీశ్రీ రవిశంకర్‌, ఆయుర్వేదిక్‌ టూత్‌పేస్టులు, సబ్బులు విక్రయించడానికి 1,000 రిటైల్‌ స్టోర్లను త్వరలోనే ప్రారంభించబోతున్నారు. భారత్‌లో హెర్బల్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రవిశంకర్‌ కూడా ఆయుర్వేదిక్‌ ఉత్పత్తుల స్టోర్లను లాంచ్‌ చేయబోతున్నట్టు తెలిసింది. దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాతకమైన పౌర సత్కారం పొందిన శ్రీశ్రీ రవిశంకర్‌, క్లినిక్స్‌, ట్రీమెంట్‌మెంట్‌ సెంటర్లను కూడా లాంచ్‌చేయబోతున్నారు. దేశీయ కన్జ్యూమర్‌ ఇండస్ట్రిలో ఆధిపత్య స్థానంలో ఉన్న బహుళ జాతీయ కంపెనీలకు ఇక పతంజలి నుంచి మాత్రమేకాక, శ్రీశ్రీ రిటైల్‌ స్టోర్ల నుంచి గట్టిపోటీ నెలకొనబోతుంది. ప్రజలు తమ రోజువారీ జీవనంలో ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారని, ప్రస్తుతం మార్కెట్‌ ప్లేయర్స్‌ అందిస్తున్న వాటికంటే భిన్నంగా తమ బ్రాండ్‌ ఉత్పత్తులను ఆఫర్‌ చేయనున్నట్టు శ్రీశ్రీ ఆయుర్వేద ట్రస్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ తేజ్‌ కట్పిటియా చెప్పారు. 
 
''శ్రీశ్రీ తత్త్వ'' బ్రాండెడ్‌ స్టోర్లను ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కంపెనీ మోడరన్‌ రిటైల్‌ స్టోర్లు, ఆన్‌లైన్‌ ద్వారా హెల్త్‌ డ్రింక్స్‌, సబ్బులు, సుగంధాలు, సుగంధద్రవ్యాలును 2003 నుంచి విక్రయిస్తోంది. కానీ ప్రస్తుతం పలు ఆహార, గృహ కేటగిరీల్లో 300కు పైగా ఉత్పత్తులతో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నారు. ఈ ఉత్పత్తులను కూడా భారత్‌లో మూడు తయారీ యూనిట్లలో ఇన్‌-హౌజ్‌గానే ఉత్పత్తిచేస్తున్నారు. మరోవైపు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్‌ యూనిలివర్‌ కూడా ఆయుష్‌ బ్రాండులో ఆయుర్వేదిక్‌ పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులను రీలాంచ్‌ చేసింది. డాబర్‌ కూడా తన తొలి ఆయుర్వేదిక్‌ జెల్‌ టూత్‌పేస్ట్‌ను డాబర్‌ రెడ్‌ ప్రాంచైజ్‌ కింద ఆవిష్కరించింది. 
 
మరిన్ని వార్తలు