వినియోగ స్టాక్స్‌ను కొనొచ్చు!

30 Oct, 2016 02:14 IST|Sakshi
వినియోగ స్టాక్స్‌ను కొనొచ్చు!

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతన కమిషన్ సిఫార్సుల అమ లు తదితర అంశాలతో ఈ ఏడా ది వినియోగ వస్తువుల సంస్థలు మెరుగ్గా రాణించే అవకాశాలున్న ట్లు జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి చెప్పారు. స్మాల్‌క్యాప్ షేర్లు కరెక్షన్‌కు గురయ్యే అవకాశాలున్నా... మార్కెట్లు మొత్తంగా ఎగువ దిశగానే వెళ్లే అవకాశాలున్నట్లు చెప్పారాయన. మా ర్కెట్లకు సంబంధించి వివిధ అంశాలపై తన అభి ప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
  అవి...
 
 ఈ సారి ఏ రంగాలు బాగుంటాయి?
 వినియోగ వస్తువుల్ని తయారు చేసే సంస్థలు, కొన్ని ఇన్‌ఫ్రా సంస్థలు మెరుగ్గా ఉండొచ్చు. ఎందుకంటే మెరుగైన రుతుపవనాలు, వేతన కమిషన్ సిఫార్సుల అమలు, ఓఆర్‌ఓపీ (వన్ ర్యాంక్ వన్ పెన్షన్) వంటివి వినియోగ వస్తువుల డిమాండ్‌ను పెంచుతాయి. తక్కువ వడ్డీ రేట్లు కూడా డిమాండ్ మెరుగుదలకు తోడ్పడతాయి. హౌసింగ్, హౌసింగ్ ఫైనాన్స్, ఆటోమొబైల్స్ మొదలైన వడ్డీ రేట్ల ఆధారిత రంగాలు మెరుగ్గా ఉండొచ్చు.
 
 మరి ఇన్‌ఫ్రా సంగతో..?
 రైల్, రోడ్ సెగ్మెంట్స్‌లో పురోగతి కనిపించవచ్చు. హైవేల నిర్మాణం ఊపందుకుంటోంది. ప్రభుత్వం ఇతరత్రా అడ్డంకులు తొలగించే ప్రయత్నాలు చేస్తోంది. రైల్వేస్, పోర్టులు అనుసంధానం  ఊపందుకుంటోంది. దీర్ఘకాలికంగా ఇన్‌ఫ్రా కూడా మెరుగ్గా ఉండగలదు.
 
 మొత్తంగా మార్కెట్లు పెరుగుతాయా?
 హెచ్చుతగ్గులన్నీ పరిగణనలోకి తీసుకుని సంవత్ నుంచి సంవత్ దాకా చూస్తే ఈసారి మార్కెట్స్‌లో పెద్దగా లాభాలేమీ కనిపించకపోవచ్చు. గరిష్ట స్థాయులను తాకి కిందికి  వచ్చాక దాదాపు ఏడాదిన్నరగా మార్కెట్లు మళ్లీ ఆ స్థాయులకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యపడటం లేదు. ఆగస్టు-సెప్టెంబ ర్ 2014 నుంచి మార్చి 2015 దాకా జరిగిన ర్యాలీ తర్వాత మార్కెట్లు  ఒక శ్రేణిలోనే తిరుగుతున్నాయి. సాంకేతికంగా ఈ శ్రేణిని బ్రేక్ చేస్తే మళ్లీ ఊపందుకునే అవకాశముంది. ఫండమెంట ల్‌గా చూస్తే... కొంత అనిశ్చితి పెరిగింది. అమెరికా ఎన్నికలు, జీఎస్‌టీ, వర్షాలు, గ్రామీణ ప్రాం తాల్లో డిమాండ్ మొదలైనవి ప్రభావితం చేయొ చ్చు.  ప్రస్తుతం చూస్తే కిందికి పడటం కన్నా ఎక్కువగా ఎగువ దిశగా వెళ్లేట్లే కనిపిస్తున్నాయి.
 
 చిన్న చిన్న షేర్లూ బాగా పెరిగాయిగా?
 అవును! లార్జ్ క్యాప్ స్టాక్స్‌తో పోలిస్తే స్మాల్, మిడ్ క్యాప్ షేర్ల విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి కరెక్షన్స్‌కి లోనయ్యే అవకాశాలున్నాయి.
 
 మరి రిస్కుల సంగతేంటి?
 భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత, క్రూడ్ ధరలు పెరిగే అవకాశం, ఎకానమీ ఊగిసలాట, ప్రపంచ దేశాల వృద్ధిపై అనిశ్చితి వంటి రిస్కులున్నాయి. ఇవి మార్కెట్ల ఒడిదుడుకులకు దారితీయొచ్చు. దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ పారిశ్రామిక రంగం ఇంకా క్షేత్రస్థాయిలో పుంజుకోవాల్సి ఉంది. కార్పొరేట్ ఫలితాల్లో ఈ ధోరణి కనిపించాల్సి ఉంది. కాకపోతే మెరుగైన వర్షపాతం, 7వ పే కమిషన్ సిఫార్సుల అమలు, ఏప్రిల్ నుంచి జీఎస్‌టీ అమలు, ఇతరత్రా సంస్కరణలు మార్కెట్‌కు ఊతమివ్వొచ్చు.

 

>
మరిన్ని వార్తలు