ప్రస్తుత బ్యాంకులకు పేమెంటు బ్యాంకులు పోటీరావు: క్రిసిల్

22 Aug, 2015 01:25 IST|Sakshi
ప్రస్తుత బ్యాంకులకు పేమెంటు బ్యాంకులు పోటీరావు: క్రిసిల్

ముంబై : ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకులకు త్వరలో రానున్న పేమెంట్ బ్యాంకులు(పీబీ) పోటీ కాబోవని శుక్రవారం విడుదల చేసిన ఒక నివేదికలో రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అభిప్రాయపడింది. బ్యాంకింగ్ వ్యవస్థ అంతగా బలపడని తూర్పు, ఈశాన్య, మధ్య ప్రాంతాలపై పేమెంట్ బ్యాంకులు ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలిపింది. రానున్న పేమెంట్ బ్యాంకుల గురించి ప్రస్తుత బ్యాంకులు ఎటువంటి ఆందోళనా చెందనక్కర్లేదని క్రిసిల్ చీఫ్ విశ్లేషకులు పవన్ అగర్వాల్ పేర్కొన్నారు.

పైగా పీబీలతో ప్రస్తుత బ్యాంకులు అవగాహన కుదుర్చుకుని, అన్‌బ్యాంకింగ్ ప్రాంతాల్లో ‘వ్యయ భారాలు లేని’ సేవల విస్తరణ దిశగా ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.  11 పేమెంట్ బ్యాంకులకు రెండు రోజుల క్రితం ఆర్‌బీఐ లెసైన్సులివ్వడం తెలిసిందే.

మరిన్ని వార్తలు