పేటీఎం బాస్ ఖరీదైన ఇల్లు.. ధరెంతో తెలుసా?

7 Jun, 2017 09:53 IST|Sakshi
పేటీఎం బాస్ ఖరీదైన ఇల్లు.. ధరెంతో తెలుసా?
బెంగళూరు : నోట్ల రద్దు అనంతరం పేటీఎంకు పెరిగిన ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సంపద కూడా అంతే మొత్తంలో దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ లో ఒకటైన న్యూఢిల్లీ గల్ఫ్ లింక్స్ లో ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నారు. దీని విలువ దాదాపు రూ.82 కోట్లు. లుటియెన్స్ జోన్ లో కనీసం 6000 చదరపు అడుగుల ప్రాపర్టీపై ఎంఓయూ కుదుర్చుకున్నారని,  ఇప్పటికే ఆయన కొంతమొత్తం చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ లావాదేవీ రిజిస్ట్రర్ కాలేదు.  ఫ్లిప్  కార్ట్ అనంతరం రెండో అత్యంత విలువైన ఎంటర్ ప్రైజ్ గా పేటీఎంకు పేరుంది. దీనికి వ్యవస్థాపకుడైన విజయ్ శేఖర్ శర్మకు కూడా మార్కెట్లో మంచి పేరును సంపాదించారు.
 
ఫోర్బ్స్ జాబితాలో అతిపిన్న భారత బిలీనియర్ గా శర్మ చోటుదక్కించుకున్నారు. ఈయన నికర సంపద 1.3 బిలియన్ డాలర్లు. గతేడాది శర్మ సంపద 162 శాతం పెరిగింది.  ఇటీవల కాలంలో ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకులు బిన్నీ, సచిన్ బన్సాల్ లు కూడా మల్టి-మిలియన్ డాలర్  రెసిడెన్షియల్  ఇన్వెస్ట్ మెంట్లు చేపట్టారు. శర్మ ఈ ఆస్తిని కొనుగోలు చేయడం కేవలం అతిపెద్ద విషయమే కాక, లుటియెన్స్ జోన్ లో అడుగుపెట్టిన ఇంటర్నెట్ బిలియనర్ గా కూడా విజయ్ శేఖర్ శర్మ మార్క్ కొట్టేయనున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్పాయి. 1000 బంగ్లాలతో 3000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో 70 ఎకరాలను మాత్రమే ప్రైవేట్ గా వాడతారు.  
 
మరిన్ని వార్తలు