పేటీఎంలో1% వాటా 325 కోట్లు

12 Dec, 2016 14:30 IST|Sakshi
పేటీఎంలో1% వాటా 325 కోట్లు

వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ విక్రయం
ఈ నిధులు పేమెంట్ బ్యాంకుపై పెట్టుబడి
పేటీఎం పేమెంట్ బ్యాంకులో శర్మకు 51 శాతం వాటా

న్యూఢిల్లీ: డిజిటల్ వ్యాలెట్ సేవలు, ఈ కామర్స్ సంస్థ పేటీఎం (వన్97 కమ్యూనికేషన్‌‌స)లో ఒక్క శాతం వాటాను ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఏకంగా రూ.325 కోట్లకు విక్రరుుంచారు. దీంతో రూ.32,500 కోట్ల మార్కెట్ విలువ(అంచనా)తో పేటీఎం భారీ కంపెనీల సరసన నిలవనుంది. పేటీఎం మాతృ సంస్థ.. వన్97 కమ్యూనికేషన్‌‌సలో శర్మకు ఈ ఏడాది మార్చి నాటికి 21% వాటా ఉంది. ప్రస్తుత వాటా విక్రయం అనంతరం ఇది 20%కి పరిమితం కానుంది. తాజా పరిణామంపై పేటీఎం అధికార ప్రతినిధి స్పం దిస్తూ.. పేటీఎం పేమెంట్ బ్యాంకు కార్యకలాపాల కోసమే వాటా విక్రయం జరిగినట్టు స్పష్టం చేశారు. కంపెనీలో ప్రస్తుత వాటాదారులే కొనుగోలు చేశారని తెలిపారు. అంతకు మించి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

పేటీఎం పేమెంట్ బ్యాంకులో విజయ్ శేఖర్ శర్మకు 51 శాతం, మిగిలిన వాటా వన్97 కమ్యూనికేషన్‌‌స చేతిలో ఉంది. పేమెంట్ బ్యాంకు ఏర్పాటుకు గతేడాది శర్మకు ఆర్‌బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఆర్‌బీఐ నుంచి తుది అనుమతి వచ్చిన వెంటనే పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించే సన్నాహాల్లో ఈ సంస్థ ఉంది. పేటీఎం వ్యాలెట్ వ్యాపారాన్ని ఇటీవలే పేమెంట్ బ్యాంకుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. వన్97 కమ్యూనికేషన్‌‌సలో 40 శాతం వాటాలు చైనాకు చెందిన అలీబాబా గ్రూపు, దాని అనుబంధ సంస్థ ఏఎంటీ ఫైనాన్షియల్ చేతిలో ఉన్నారుు. వీటితోపాటు సెరుుఫ్ పార్ట్‌నర్స్, ఇంటెల్ క్యాపిటల్, శాప్ వెంచర్స్ కూడా వాటాలు కలిగి ఉన్నారుు. 

బాధ్యతలన్నీ ఆయనవే...
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ విజయ్ శేఖర్ శర్మ స్వస్థలం. అక్కడే పదో తరగతి వరకు హిందీ మాతృభాషగా చదువు పూర్తి చేసిన ఆయన ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు.  2005లో వన్97 కమ్యూనికేషన్‌‌సను స్థాపించారు. వార్తలు, క్రికెట్ స్కోర్, రింగ్‌టోన్లు, జోక్స్, పరీక్షా ఫలితాల వెల్లడి వంటి సేవలను ప్రారంభంలో ఈ సంస్థ అందించింది. పేమెంట్ సేవల కోసం 2010లో పేటీఎంను ప్రారంభించడం కీలక మలుపు. పేటీఎం చైర్మన్‌గా, ఎండీగా, సీఈవోగా అన్ని బాధ్యతలను చేపట్టి... కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ, అమలు వంటి కీలక వ్యవహారాల్ని నిర్వహిస్తున్నారు. కాలేజీ రోజుల్లోనే ఎక్స్‌ఎస్ కార్ప్ అనే వెంచర్‌ను ప్రారంభించిన ఆయన 1999లో దాన్ని న్యూజెర్సీకి చెందిన లోటస్ ఇంటర్‌వర్‌క్స్‌కు విక్రరుుంచారు. తనతోపాటు పేటీఎంను ఈ స్థారుుకి తీసుకెళ్లడానికి కృషి చేసిన బృందానికి 4 శాతం వాటాను కానుకగా ఇచ్చి తనలోని నాయకత్వ గుణాన్ని చాటుకున్నారు.

మరిన్ని వార్తలు