నాలుగు నెలల ముందే లక్ష్యసాధన: పేటీఎం

12 Dec, 2016 14:49 IST|Sakshi
నాలుగు నెలల ముందే లక్ష్యసాధన: పేటీఎం

న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు వాలెట్ సంస్థలకు బాగా అనుకూలించింది. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రోజుకు 70 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని పేటీఎం పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని తెలిపింది. దీంతో తాము 5 బిలియన్ డాలర్ల విలువైన జీఎంవీ అమ్మకాల లక్ష్యాన్ని నాలుగు నెలల ముందే సాధించామని పేర్కొంది. ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన వస్తువుల విక్రయానికి సంబంధించిన మొత్తం విలువనే జీఎంవీగా పరిగణలోకి తీసుకుంటాం. పేటీఎం జీఎంవీ గతేడాది 3 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా పేటీఎం.. మొబైల్ పేమెంట్ సర్వీసులతోపాటు ఈ-కామర్స్ సేవలను కూడా అందిస్తోంది. దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీల కన్నా తమ ప్లాట్‌ఫామ్ ఆధారంగా జరిగే ట్రాన్సాక్షన్లే ఎక్కువగా ఉన్నాయని పేటీఎం పేర్కొంది.

మరిన్ని వార్తలు