వ్యాపారుల కోసం పేటీఎం ఆల్‌–ఇన్‌–వన్‌ క్యూఆర్‌

9 Jan, 2020 04:56 IST|Sakshi

ముంబై: డిజిటల్‌ పేమెంట్స్‌ సేవల సంస్థ పేటీఎం దేశవ్యాప్తంగా వ్యాపారుల కోసం ఆల్‌–ఇన్‌–వన్‌ క్యూఆర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టింది. పేటీఎం వ్యాలెట్, రూపే కార్డులు, అన్ని యూపీఐ ఆధారిత పేమెంట్‌ యాప్స్‌ ద్వారా జరిగే చెల్లింపులు నేరుగా వ్యాపారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. దీనికి ఎటువంటి ఫీజు ఉండదని పేర్కొన్నారు. దీనితో పాటు కస్టమర్ల లావాదేవీల వివరాలను పొందుపర్చే డిజిటల్‌ లెడ్జర్‌ ‘బిజినెస్‌ ఖాతా’ సర్వీసును కూడా పేటీఎం ప్రవేశపెట్టింది.

మరిన్ని వార్తలు