పేటీఎం ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్‌ : ఆఫర్ల వెల్లువ

19 Sep, 2018 08:43 IST|Sakshi
పేటీఎం మాల్‌ ఫెస్టివ్‌ సీజన్‌ సేల్‌

బెంగళూరు : పేటీఎం మాల్‌లో ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్‌ ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి(సెప్టెంబర్‌ 20) మూడు రోజుల పాటు ఫెస్టివల్‌ సీజన్‌ సేల్‌ను నిర్వహించబోతుంది  పేటీఎం మాల్‌. ఈ సేల్‌లో తన సైట్‌లో ఆఫర్‌ చేసే స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు సుజుకి జిక్సర్‌ బైక్‌ను గెలుపొందే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. ఈ సేల్‌లో ఆఫర్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌, శాంసంగ్‌ గెలాక్సీ జే8, మోటో జీ6, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ, హానర్‌ 9 లైట్‌, హానర్‌ ప్లేలు.

పలు స్మార్ట్‌ఫోన్లపై పేటీఎం 50 శాతం డిస్కౌంట్‌తో మురిపిస్తుంది. గెలాక్సీ నోట్‌ 9 128జీబీ వేరియంట్‌ను రూ.67,900కే కొనుగోలు చేయొచ్చు. నోట్‌9 అనే కోడ్‌ను వాడి ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదేవిధంగా హానర్‌ 9 లైట్‌ను 23 శాతం డిస్కౌంట్‌, 2000 రూపాయల క్యాష్‌బ్యాక్‌తో రూ.13,945కే విక్రయిస్తుంది పేటీఎం మాల్‌. మోటో జీ6పై 12 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌లో రూ.15,814కే అందుబాటులోకి వస్తుంది. ఎంఓబీ1500 ప్రోటో కోడ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1500 క్యాష్‌బ్యాక్‌ను కూడా కంపెనీ ఆఫర్‌ చేస్తుంది. 

అయితే ఈ ఫెస్టివ్‌ సేల్‌ నిర్వహించే రోజుల్లో ఆఫర్లు మారే అవకాశం కనిపిస్తుంది. కేవలం స్మార్ట్‌ఫోన్లపైనే కాకుండా.. కెమెరాలు, హెడ్‌ఫోన్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై కూడా 70 శాతం తగ్గింపు లభిస్తుంది. డెల్‌ ఇన్సిరాన్‌ 3000 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్‌ 12 శాతం తగ్గింపు అందిస్తుంది పేటీఎం మాల్‌. దీనిపై నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. పేటీఎం ఫెస్టివ్‌ సీజన్‌ సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్‌ 23 వరకు కొనసాగుతోంది. 

  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా