పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌

3 Mar, 2018 12:23 IST|Sakshi

బెంగళూరు : పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆ కంపెనీ. నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ) వివరాలు సమర్పించనప్పటికీ, పేటీఎం వాలెట్‌లోకి నగదును లోడ్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. డిజిటల్‌ వాలెట్‌ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ వివరాలు సమర్పించాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. లేదంటే వాలెట్లు పనిచేయవని, వాలెట్స్‌లోకి కొత్తగా నగదును పంపించుకోవడం జరుగదని పేర్కొంది. అయితే ప్రస్తుతం పేటీఎం యూజర్లు కేవైసీ వివరాలు సమర్పించనప్పటికీ, గిఫ్ట్‌ ఓచర్ల ద్వారా వాలెట్‌లోకి నగదును లోడ్‌ చేసుకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఈ గిఫ్ట్‌ ఓచర్లను ఇతరులకు పంపించుకోవడం కానీ, బ్యాంకు అకౌంట్లలోకి ట్రాన్సఫర్‌ చేసుకోవడం కానీ జరుగదు.   

ఆర్‌బీఐ యూజర్లు తీసుకొచ్చిన ఈ నిబంధనలతో డిజిటల్‌ వాలెట్లు భారీ ఎత్తున్న తమ కస్టమర్లను కోల్పోతున్నారు. అమెజాన్‌ ఇండియా తన ఈ-వాలెట్‌ యూజర్‌ బేస్‌లో 30 శాతం క్షీణతను నమోదుచేసింది. పేటీఎం కూడా తన కోర్‌ ఈ-వాలెట్‌ బిజినెస్‌లను ఇతర వ్యాపారాలకు విస్తరిస్తోంది. మరోవైపు తగ్గిపోతున్న యూజర్‌ బేస్‌ను కాపాడుకోవడానికి ఈ గిఫ్ట్‌ ఓచర్లను కూడా  పేటీఎం జారీచేస్తోంది. ఈ గిఫ్ట్‌ ఓచర్లను గ్రే ఏరియాలో ఆపరేటింగ్‌ చేస్తున్నట్టు కూడా ఓ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా