చిక్కుల్లో పేటీఎం: సీఈవో తొలగింపునకు ఆదేశాలు?

1 Aug, 2018 16:20 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల  సంస్థ పేటీఎం పేమెంట్‌ బ్యాంకును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) షాక్‌ ఇచ్చింది. కొత్త వినియోగదారుల నమోదును సస్పెండ్  చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  దీంతో తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించుకోవాలని యోచిస్తున్న డిజిటల్‌ దిగ్గజం పేటిఎంకు కొత్త చిక్కులు వచ్చినట్టే  కనిపిస్తోంది. 

అధికారిక ఆడిట్ తర్వాత, డిజిటల్‌ పేమెంట్‌ బ్యాంకు  పేటీఎంలో జూన్ 20నుంచి కొత్త కస్టమర్లను నమోదు చేయడాన్ని ఆర్బిఐ నిలిపివేసిందట.  కెవైసీ నిబంధనలు ఉల్లంఘనలు ఆరోపణలతో ఈ ఉత్వర్వులు జారీచేసినట్టు తెలుస్తోంది. అలాగే బ్యాంకు సీఈవో రేణు సత్తిని తొలగించాల్సింది కూడా ఆదేశించినట్టు సమాచారం.  దీంతో పాటు కస్టమర్ డేటాను నిల్వ చేయడానికి మెరుగైన భద్రతా యంత్రాంగాలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని పేటీఎంకు సూచించింది. ఇందుకు వన్‌97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నుండి వేరుగా  నూతన  కార్యాలయ ఏర్పాటును కోరింది.

మరోవైపు  పేటీఎంలో కరెంట్‌ ఖాతాలను పరిచయం చేసేందుకు,  వినియోగదారులు సౌలభ్యంకోసం ఖాతా తెరిచే ప్రక్రియను  సులభతరం చేస్తోందని,   అందువల్లనే కొత్త నమోదు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడిందని కంపెనీ ఎగ్జి‍క్యూటివ్‌ ఒకరు తెలిపారు. అయితే తాజా  నివేదికలపై ఆర్‌బీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది.  అయితే కేవీసీ నిబంధనల ఉల్లంఘనలు, ఇతర ఆరోపణల నేపథ్యంలోగతంలో ఎయిర్‌టెల్‌కుచెందిన చెల్లింపుల బ్యాంకుకు గట్టి షాకే  ఇచ్చింది. తాత్కాలికంగా  ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంకు సేవలను నిలిపివేయడంతో పాటు,  5 కోట్ల రూపాయలజరిమానా విధించిన సంగతి తెలిసిందే.  

కాగా సుమారు 500 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పేటీఎం చైనాలోని కౌబే, మిథువాన్ తరహాలో నూతన రిటైల్ బిజినెస్‌ను విస్తరించాలని   యోచిస్తున్నట్టు ఇటీవల పేటీఎం సీఈవో రేణు  సత్తి ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌​​​​

 విజయ్‌ మాల్యాకు షాక్‌

టాటా మోటార్స్‌ కార్ల ధరలు పెంపు

హాట్‌స్టార్‌ బంపర్‌ ఆఫర్‌ : రోజుకు ఒక రూపాయే

వాల్‌మార్ట్‌ భారీ పెట్టుబడులు : ఇక దిగ్గజాలకు దిగులే

13 రూట్లలో విమాన సర్వీసులు రద్దు

ఆరోగ్యానికి దగ్గరగా ది ఆర్ట్‌

కేంద్రానికి ఆర్‌ఈసీ 1,143 కోట్ల డివిడెండ్‌

ఎల్‌పీజీ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలి 

యూనియన్‌ బ్యాంక్‌ ఓపెన్‌ ఆఫర్‌కు మినహాయింపు

ఎనిమిది రోజుల లాభాలకు బ్రేక్‌ 

జనవరిలో 8.96 లక్షల నూతన ఉద్యోగాలు 

భారీగా పెరిగిన  విదేశీ మారక నిల్వలు

ముంబై ఎయిర్‌పోర్టులో వాటా పెంచుకున్న జీవీకే 

టాప్‌గేర్‌లో ‘ఆల్టో’...

మార్కెట్లోకి ‘ట్రెండ్‌ ఈ’ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 

‘డిజిటల్‌ ప్రచార వేదిక.. ‘అప్‌డేట్స్‌’

లక్ష్యాన్ని అధిగమించిన డిజిన్వెస్ట్‌మెంట్‌: జైట్లీ 

వృద్ధి వేగం... అయినా 6.8 శాతమే!

బంకుల్లో విదేశీ పాగా!! 

ఓలాకు షాక్‌.. ఆరు నెలల నిషేధం

నీరవ్‌ ఎఫెక్ట్‌ : చోక్సీ కొత్త రాగం

ప్రాఫిట్‌ బుకింగ్‌ : నష్టాల్లోకి మార్కెట్లు 

శాంసంగ్‌ దూకుడు : తొలి 5జీ ఫోన్‌ వెరీ సూన్‌

ఉత్సాహంగా స్టాక్‌మార్కెట్లు

‘4 నెలలుగా జీతాలు లేవు.. అమ్మ నగలు తాకట్టు పెట్టా’

షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఫేస్‌బుక్‌

ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు.. ‘ఫేమ్‌’!

జపాన్‌ టు ఇండియా!

ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు

సస్పెన్స్‌.. హారర్‌.. థ్రిల్‌

తలైవి కంగన

ఆ వార్తల్లో నిజం లేదు