హోటల్స్‌, కస్టమర్లకు పేటీఎం‌ గుడ్‌న్యూస్‌

11 Jun, 2020 16:40 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ విలయతాండవంతో అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటిలో హోటల్‌ పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో  డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎం‌ హోటల్ వ్యాపారులకు, కస్టమర్లకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంది. పేటీఎమ్‌ సంస్థ ‘స్కాన్‌ టు ఆర్డర్’‌ పేరిట సరికొత్త ఆవిష్కరణ చేసింది. లక్షలాది మంది భారతీయులకు సురక్షిత ఆహారాన్ని అందించడంలో ఈ ఆవిష్కరణ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది.

అయితే స్టార్‌ హోటల్స్‌, రెస్టారెంట్స్‌, కేఫ్‌.. ఎక్కడికి వెళ్లినా కస్టమర్లు పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ను వినియోగించవచ్చని పేటీఎం తెలిపింది. ఇది వరకు వినియోగదారుడు భోజనానికి ఆర్డర్‌ చేసే ముందు మెను పేపర్‌ను టచ్‌ చేసే వారు.. ప్రస్తుతం క్యూఆర్‌ స్కాన్‌తో తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాధించవచ్చని తెలిపింది. పేటీఎం సంస్థ లేబల్‌ ఉత్పత్తిని(పేరు, లోగో, బ్రాండ్‌) రెస్టారెంట్లు, ఆహార సంస్థలకు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా అందిస్తోంది. (చదవండి: పేటీఎం అప్‌డేట్‌.. డబ్బులు హాంఫట్‌!)

ఆహార రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు తమ ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుందని.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. అయితే పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, నెట్‌బ్యాంకింగ్‌, తదితర కార్డులు ఉన్న ప్రతి వినియోగదారుడు స్కాన్‌ టు ఆర్డర్‌ కోడ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

పేటీఎం యాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడిని స్కాన్‌ చేసి ఆర్డర్‌కు వర్తించే నిబంధనలు..
1)మొదటగా పేటీఎమ్‌ యాప్‌ ద్వారా రెస్టారెంట్‌ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి మెను చెక్‌ చేయాలి
2)వినియోగదారులకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్‌ చేయుటకు యాప్‌లో యాడ్‌ ఐకాన్‌ ఆఫ్షన్‌ సెలక్ట్‌ చేయాలి
3)ఆఫ్షన్‌ సెలక్ట్‌ చేసాక గో టు కార్ట్‌ ఆఫ్షన్‌ ను సెలక్ట్‌ చేయాలి
4)చివరగా ట్రాన్సాక్షన్‌ పూర్తి చేయుటకు ప్రొసీడ్‌ టు పేటీఎం ఆఫ్షన్‌ సెలక్ట్‌ చేయాలి.
 ఈ నియమాలతో మీరు ఎంచుకున్న ఆహారానికి సంబంధించిన ఆర్డర్‌ను పొందవచ్చు‌.

మరిన్ని వార్తలు