పేటీఎం హ్యాక్ అయిందా...?

12 Dec, 2016 15:19 IST|Sakshi
పేటీఎం హ్యాక్ అయిందా...?

కొద్దిసేపు నిలిచిపోయిన వ్యాలెట్ సర్వీసులు   
హ్యాక్ అంటూ సోషల్ మీడియాలో వదంతులు
2 లక్షల యూజర్ల డేటా హ్యాకర్లకు చిక్కిందంటూ టీవీల్లోనూ వార్తలు
సాంకేతిక కారణాలవల్లే నిలిచాయన్న పేటీఎం 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అందరూ ఎలక్ట్రానిక్ లావాదేవీలవైపు మళ్లుతున్న తరుణంలో... ఊహించని సంఘటన జరిగింది. ఎలక్ట్రానిక్ లావాదేవీలకు పర్యాయపదంగా నిలుస్తూ... ప్రతి చిన్న వర్తకుల మొబైల్లోనూ కనిపిస్తున్న వ్యాలెట్ దిగ్గజం పేటీఎం... మంగళవారం కాసేపు పనిచేయకుండా పోరుుంది. చాలామంది తమ లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నించగా పనిచేయలేదు. కొందరు తమ పేటీఎం ఖాతాల్లోని నగదును బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవటానికి ప్రయత్నించగా ‘నెట్‌వర్క్ ఎర్రర్’ అంటూ కనిపించింది. అరుుతే ఇదే సమయంలో... పేటీఎం డేటా బేస్ హ్యాక్ అరుుందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అరుుంది.

అందరూ ఈ రకమైన మెసేజ్‌లు చూసి కంగారు పడ్డారు. ‘‘దాదాపు 2 లక్షల మంది పేటీఎం యూజర్ల తాలూకు డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లింది. హ్యాకర్లు ఇపుడు పేటీఎం సర్వర్లను బైపాస్ చేయగలుగుతున్నారు. అంటే మీరు రూ.100 రీచార్జ్ చేయాలనుకుంటే ఆ సందేశం పేటీఎంకు చేరకుండా నేరుగా హ్యాకర్లకు చేరుతుంది. వారే మీకు అనుమతిచ్చేస్తారు’’ అనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అరుుంది. దీన్ని కొన్ని చానెళ్లు కూడా ప్రసారం చేయటంతో జనంలో ఆందోళన పెరిగింది. ఇదే విషయమై పేటీఎం ప్రతినిధులను సంప్రదించడానికి ప్రయత్నించగా వారు మొదట్లో అవుననిగానీ, కాదని గానీ ఏమీ చెప్పలేదు. అరుుతే చివరకు తమ అధికారిక ట్వీటర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ... ‘వి ఆర్ బ్యాక్’ అని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల తమ సేవలు కొంతసేపు నిలిచిపోయాయని, ఇది హ్యాకింగ్ లాంటిదేమీ కాదని వారు స్పష్టం చేశారు. తమ సేవలు మామూలుగానే అందుతున్నాయని చెప్పారు.

ఎంతవరకూ సేఫ్?
పేటీఎం కార్యకలాపాలు సాంకేతిక కారణాలతో కొద్దిసేపే నిలిచినప్పటికీ... దాని వాడకందార్లలో ఆందోళన మాత్రం ఎక్కువే రాజ్యమేలింది. తమ తమ వ్యాలెట్లలో డబ్బులు మాయమై అన్నీ జీరోలు కనిపిస్తే ఏం చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలోనే ప్రశ్నలు వేయటం కనిపించింది. దీనిపై బ్యాంకింగ్, సాంకేతిక నిపుణులను సంప్రదించగా... ‘‘ఏ లావాదేవీలకై నా రక్షణ ఉంటుంది. అరుుతే చాలామంది పేటీఎం వంటి వ్యాలెట్లలో తమ క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను సేవ్ చేసి ఉంచుతున్నారు.

దీనివల్ల ప్రతిసారీ ఆ కార్డుల వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదనే మాట నిజమే. కానీ టెక్నాలజీ బాగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మోసగాళ్లు కూడా అంతకు మించిన ఎత్తులు వేస్తుం టారు. అలాంటి వారికి డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా చిక్కితే ఇబ్బందే. అందుకే మీ వ్యాలెట్లలో మీ కార్డుల వివరాలు సేవ్ చేయకపోవటమే ఉత్తమం. ఒకవేళ సేవ్ చేసి ఉంటే తక్షణమే తొలగించటం మంచిది. దానివల్ల మీరు ఒకవేళ నష్టపోరుునా ఆ నష్టం మీ వ్యాలెట్‌లో ఉన్న కొద్ది మొత్తానికే పరిమితమవుతుంది’’ అని వారు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇలాంటి సంధి సమయంలో ఇలాంటివి జరగటం ఇబ్బందికరమే!!.

మరిన్ని వార్తలు