పేటీఎం, జొమాటోలకు ఎఫ్‌‌డీఐ షాక్!?

20 Apr, 2020 14:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా పెట్టుబడులపై భారత ప్రభుత్వం దృష్టి సారించిన వేళ  స్టార్టప్ కంపెనీలు కష్టాల్లో పడనున్నాయి. ముఖ్యంగా దేశంలో వివిధ రంగాల్లోసేవలందిస్తున్న యూనికార్న్, పేటీఎం, జొమాటో, బిగ్ బాస్కెట్, డ్రీమ్ 11 లాంటి కంపెనీలకు పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడనుంది.  ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుడులపై  స్వీకరిస్తున్న  వీటికి మూలధన కొరత ఏర్పడే అవకాశం వుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌‌డీఐ)ను భారత ప్రభుత్వం కఠినతరం చేసింది.  ఇండియాతో సరిహద్దులు పంచుకునే చైనా సహా పొరుగుదేశాలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.  ఇకపై ఈ పెట్టుబడులు భారత ప్రభుత్వ అనుమతికి లోబడి వుంటాయని స్పష్టం చేసింది.  భారతీయ కంపెనీల్లో అవకాశవాద పెట్టుబడులు, స్వాధీనాలను అరికట్టే ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు అని  భారత ప్రభుత్వం శనివారం జారీచేసిన ఒక నోటిఫికేషన్  ద్వారా ప్రకటించింది 

కొత్త పెట్టుడుల కోసం చైనా పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్న కంపెనీలు కూడా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని పలువురు పెట్టుబడిదారులు, స్టార్టప్ కంపెనీ ఫౌండర్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే 33 శాతం వ్యూహాత్మక  చైనీస్ పెట్టుడులను కలిగి ఉన్నతమలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది వుండదనీ యునికార్న్ వ్యవస్థాపకుడు వ్యాఖ్యానించారు.  తాజాపరిణామాలపై ఇతర స్టార్టప్ కంపెనీలు ఇంకా స్పందించలేదు.  భవిష్యత్తు పెట్టుబడులు నిలిచిపోవడం, లేదా పెట్టుబడుల సమీకరణ జాప్యం కావచ్చని తెలిపారు. మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై  కొత్త నియమాలు డబ్ల్యుటిఒ సూత్రాలను  విరుద్ధమని స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని  వీటిని సవరించాలని చైనా సోమవారం తెలిపింది. 

చైనా కంపెనీల వ్యూహాత్మక,  ఆర్థిక పెట్టుబడులు 2019 లో 3.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది 2018లో 2 బిలియన్ డాలర్లుగా వుంది.  ముఖ్యంగా  చైనా  ఇంటర్నెట్ దిగ్గజం అలీబాబా గ్రూప్, దాని అనుబంధ యాంట్ ఫైనాన్షియల్, టెన్సెంట్ హోల్డింగ్స్, ఫోసున్ ఆర్‌జెడ్ క్యాపిటల్ యునికార్న్స్‌తో సహా పెద్ద సంఖ్యలో భారతీయ స్టార్టప్‌లలో అనేక వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులను కురిపించాయి. పేటిఎమ్, జోమాటో, బిగ్‌బాస్కెట్, పాలసీబజార్, ఉడాన్, ఓయో హోటల్స్,  ఓలా, డ్రీం 11 వీటిల్లో ప్రముఖంగా వున్నాయి. దీంతో అమెరికాను వెనక్కి నెట్టి మరీ వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్  ఎకానమీలోకి దూసుకొచ్చింది.

మరోవైపు చైనానుంచి భారత సంస్థలకు వచ్చే పెట్టుబడులన్నీ ఇకపై ప్రభుత్వ అనుమతికి లోబడి వుంటాయని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. అలాగే  భారత స్టాక్‌‌ మార్కెట్లోకి వచ్చిన చైనా పెట్టుబడులపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఆరా తీస్తోంది.  విదేశీ పెట్టుబడుల వివరాలను సమర్పించాలని ముఖ్యంగా  చైనా, హాంగ్‌‌ కాంగ్‌‌ల నుంచి వచ్చిన  ఉక్కువగా దృష్టి పెట్టాలని సెబీ కేంద్రం కోరింది. దీంతోపాటు వేరే ఏవైనా కంపెనీలు తమకు చైనాలో ఉన్న సంస్థల ద్వారా ఇండియా స్టాక్‌‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాయా అనేది కూడా చూడమని సెబీని ప్రభుత్వం ఆదేశించింది. హెచ్‌‌డీఎఫ్‌‌సీలో చైనా పీపుల్స్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ చైనా(పీబీఓసీ) వాటా మార్చి క్వార్టర్‌‌‌‌లో 0.8 శాతం నుంచి 1.01 శాతం పెంచుకుంది. చైనా బ్యాంక్‌‌ ఈ వాటాను ఓపెన్‌‌ మార్కెట్‌‌ పర్చేజ్‌‌ ద్వారా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు