ఇబ్బడిముబ్బడిగా పీఈ పెట్టుబడులు

11 Jun, 2014 00:37 IST|Sakshi
ఇబ్బడిముబ్బడిగా పీఈ పెట్టుబడులు

 పదేళ్లలో 4 వేల కోట్ల డాలర్లకు: పీడబ్ల్యూసీ
 
ముంబై: వచ్చే పదేళ్లలో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడుల పరి మాణం 4,000 కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. దేశ ఆర్థికాభివృద్ధికి పీఈ పరిశ్రమ గతంలో కంటే వచ్చే పదేళ్లలో మెరుగ్గా దోహదపడుతుందని ‘2025 నాటికి భారత్‌లో పీఈ’ అనే   నివేదికలో పేర్కొంది. 40కి పైగా పీఈ హౌస్‌ల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన ఈ నివేదికలో ముఖ్యాంశాలు..
 
*   గత ఆర్థిక సంవత్సరం అంతానికి దాదాపు 900 కోట్ల డాలర్లుగా ఉన్న పీఈ పెట్టుబడులు ఈ ఏడాది 1,000-1,200 కోట్ల డాలర్లకు చేరొచ్చు.
దాదాపు 70-80 కీలక ప్లేయర్లతో పీఈ పరిశ్రమ త్వరలో బలోపేతమయ్యే కానుంది.
* రానున్న దశాబ్దంలో కొనుగోళ్లే (బైఅవుట్‌లు) అతిపెద్ద పెట్టుబడి అవకాశాలుగా పరిణమిస్తాయని పరిశ్రమ అంచనా.
* ఈక్విటీ ఇన్వెస్టర్లు గత కొన్నేళ్లుగా వినియోగదారులు అధికంగా ఉండే వ్యాపారాలపైనే దృష్టికేంద్రీకరించారు. వచ్చే ఐదేళ్లలో దేశం నలుమూలలకూ అభివృద్ధి విస్తరించడంతో గ్రామీణ మార్కెట్లకూ వినియోగతత్వం (కన్సూమరిజం) వ్యాపించే అవకాశం ఉంది.
పీఈ కంపెనీలు గతంతో పోలిస్తే ఇపుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు