విశాఖలో పెల్లెట్‌ ప్లాంట్‌

8 Jan, 2018 02:03 IST|Sakshi

కుద్రేముఖ్, విశాఖ ఉక్కు మధ్య కుదిరిన ఒప్పందం

ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్, కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ లిమిటెడ్‌లు సంయుక్తంగా పెల్లెట్‌ ప్లాంట్‌ను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పక్కనున్న స్థలంలో ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు శనివారం మంగళూరులో ఇరు సంస్థల ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.

దీని ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా, కర్ణాటకలోని బళ్లారి గనుల్లోని ఐరన్‌ ఓర్‌ ఫైన్‌ను వినియోగించి పెల్లెట్‌లను తయారుచేస్తారు. అక్కడ తయారయ్యే పెల్లెట్‌ను స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో వినియోగిస్తారు. మొదటి దశలో 1.2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో నిర్మించి తదుపరి అవసరాల బట్టి ప్లాంట్‌ను విస్తరిస్తారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ సమక్షంలో స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పి.మధుసూదన్, కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ లిమిటెడ్‌ సీఎండీ ఎం.వి. సుబ్బారావులు ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు.

మరిన్ని వార్తలు