నెలవారీ కనీస పెన్షన్‌ రూ.7500...

5 Dec, 2017 12:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెన్షనర్ల బాడీలో సుమారు లక్ష మంది ఫించన్‌దారులు గురువారం పార్లమెంట్‌ వరకు ఆందోళన యాత్ర చేపట్టబోతున్నారు. వీరి డిమాండ్లను నెరవేర్చాలంటూ కోరుతూ వీరు ఈ ఆందోళన చేపడుతున్నారు. దీనిలో కనీస పెన్షన్‌ రూ.7,500కు పెంచాలని ప్రధానమైన డిమాండ్‌. దేశవ్యాప్తంగా ఉన్న పదవీ విరమణ ఉద్యోగులకు ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌ 1995(ఈపీఎస్‌-95)  కింద కనీస పెన్షన్‌ రూ.7500కు పెంచాలని ఈపీఎస్‌-95 జాతీయ ఆందోళన కమిటీ కోరుతోంది. ప్రస్తుతం ఫించన్‌దారులకు నెలవారీ పెన్షన్‌ రూ.1000గానే ఉంది.

కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ ప్రధాన కార్యాలయం వల్ల ఈపీఎస్‌-95లోని సభ్యులందరూ మూడు రోజుల నిరాహార దీక్ష చేపడుతున్నామని, ఒకవేళ తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, డిసెంబర్‌ 7న రామ్‌లీలా గ్రౌండ్‌ నుంచి పార్లమెంట్‌ వరకు ఆందోళన యాత్ర చేపట్టనున్నట్టు సోమవారం ఈపీఎస్‌-95 చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ వీరేంద్ర సింగ్‌ తెలిపారు. ఈపీఎస్‌-95 కింద సుమారు 60 లక్షల మంది పెన్షనర్లున్నారు. వీరిలో 40 లక్షల మంది నెలకు రూ.1500 కంటే తక్కువ పెన్షనే పొందుతున్నారు. మిగతా వారు గరిష్టంగా రూ.2000 నుంచి రూ.2500 మధ్యలో పెన్షన్‌ అందుతోంది. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ రన్‌ చేసే సామాజిక భద్రత పథకాల్లో ఈపీఎస్‌-95 కూడా ఒకటి. తమ ఈ సమస్య రెండేళ్ల నుంచి చర్చనీయాంశంగానే ఉందని పెన్షనర్ల బాడీ తెలిపింది.  
 

మరిన్ని వార్తలు