తప్పుకుంటున్న పెప్సీకో బాస్‌ ఇంద్రా నూయి

6 Aug, 2018 17:59 IST|Sakshi

సీఈవోగా ఇంద్రా నూయి గ్రేట్‌ ఇన్నింగ్స్‌కు  ఫుల్‌స్టాప్‌

ప్రపంచ అత్యంత శక్తివంతమైన మహిళా పారిశ్రామిక వేత్తగా ఘనత

2007లో పద్మభూషణ్‌ పురస్కారం

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ బిజినెస్ దిగ్గజం పెప్సీ కంపెనీ సీఈవో  భారత్‌కు చెందిన ఇంద్రా కృష్ణమూర్తి నూయి (62) పదవీ విరమణ చేయనున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో  ఒకరైన ఇంద్రానూయి త్వరలోనే తన  బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.   ఈ మేరకు  కంపెనీ సోమవారం ఒక  ప్రకటన విడుదల  చేసింది.

పెప్సీకో సంస్థతో 24 సంవత్సరాల అనుబంధం, సీఈవోగా  12 ఏళ్ల సుదీర్ఘ సేవల  అనంతరం ఆమె  ఈ ఏడాది అక్టోబర్‌ 3వ  తేదీన తన పదవికి రాజీనామా చేయనున్నారు.  ఇంద్రా నూయి స్థానంలో.. ఆ కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగౌర్తా కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే 2019 ఆరంభం వరకు ఆమెనే చైర్మన్‌గా కొనసాగుతారు. ఇండియాలో  పుట్టిపెరిగి, పెప్సీకో లాంటి అసాధారణ సంస్థను నడిపించే అవకాశం వస్తుందని తాను ఊహించలేదని నూయి వ్యాఖ్యానించారు. సీఈవోగా తమ ఉత్పత్తులతో ఊహించిన దాని కంటే ప్రజల జీవితాల్లో మరింత అర్ధవంతమైన ప్రభావం చూపానన్నారు.   నేడు చాలా దృఢంగా ఉన్న పెప్సీకో కంపెనీ   భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కంపెనీకి  ఇన్నాళ్లు సేవలందించినందుకు తనకు చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు