ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్స్‌ యాప్‌ క్యాష్‌

17 Apr, 2017 02:00 IST|Sakshi
ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్స్‌ యాప్‌ క్యాష్‌

యువ ప్రొఫెషనల్స్‌.. స్వల్పకాలిక అవసరాల కోసం రుణాలను అప్పటికప్పుడు పొందేందుకు క్యాష్‌ఇ (CASHe) యాప్‌ ఉపయోగపడుతుంది. సుమారు రూ.5,000 నుంచి రూ. 1,00,000 దాకా రుణాలను 15, 30, 90 రోజుల వ్యవధికి పొందవచ్చు. ఫేస్‌బుక్, గూగుల్‌ ప్లస్‌ లేదా లింక్డ్‌ఇన్‌ ద్వారా ఈ మొబైల్‌ యాప్‌లోకి లాగిన్‌ కావచ్చు. దరఖాస్తుదారు వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద తాము నివసించే నగరం, పనిచేసే సంస్థ, జీతం మొదలైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

 పాన్‌ కార్డు, అడ్రెస్‌ ప్రూఫ్, లేటెస్ట్‌ శాలరీ స్లిప్స్, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ మొదలైన డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్‌ చేయాలి. రెండు గంటల్లోగా ఎంత రుణం పొందేందుకు అర్హత ఉందనేది యాప్‌ తెలియజేస్తుంది. అర్హత ప్రకారం రుణమొత్తం, వ్యవధి, వడ్డీ రేటు తదితర వివరాలు చూపిస్తుంది. అవసరానికి అనుగుణమైనది ఎంచుకుంటే.. సదరు రుణ మొత్తం కొంత వ్యవధిలో బ్యాంక్‌ ఖాతాలోకి జమవుతుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌కి 4.2 రేటింగ్‌ ఉంది.

మరిన్ని వార్తలు