పెట్రో ధరలకు వ్యాట్ షాక్ 

5 May, 2020 10:42 IST|Sakshi

ఆంధ్రా, తెలంగాణాలో యథాతథం

చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ.3.26 పెంపు 

ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.1.67 పెంపు

సాక్షి,  న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో పెట్రో ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పెంచిన దాదాపు 50 రోజుల తరువాత మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు  రూ. 1.67లు పెరగ్గా, డీజిల్ ధర  ఒక్కసారిగా రూ. 7.10  పెరిగింది. 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్  ప్రకారం సోమవారం రూ .69.59  పలికిన లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ .71.26  పలుకుతోంది. అలాగే సోమవారం  నాటి  డీజిల్ ధర  రూ .62.29 నుంచి రూ .69.29 కు పెరిగింది. చెన్నైలో కూడా పెట్రోల్  రూ .3.26 పెరిగింది.  లీటరు పెట్రోలు ధర రూ. 75.54  డీజిల్ ధర 68.22 రూపాయలు పలుకుతోంది.

రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన వ్యాట్ పెరుగుదల కారణంగా అసోం, హర్యానా, నాగాలాండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు.

ముంబైలో పెట్రోల్‌ లీటరు ధర రూ .76.31, డీజిల్ ధర లీటరుకు రూ. 66.21 గా వుంది. 
కోల్‌కతాలో, పెట్రోల్ ధర లీటరుకు 73.30 రూపాయలు కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 65.62.

అటు హైదరాబాద్, అమరావతిలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు  రూ. 73.97 కాగా, డీజిల్ ధర  లీటరుకు రూ. 67.82
అమరావతిలో  పెట్రోల్ ధర లీటరుకు రూ.74.61 కాగా, డీజిల్ ధర  లీటరుకు  రూ. 68. 52

సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వుంటాయి. విదేశీ మారకపు రేటుతో ప్రపంచ మార్కెట్లో ముడి  చమురు ధరల ఆధారంగా ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరల  సవరణ వుంటుంది. 

మరిన్ని వార్తలు