వామ్మో! పెట్రో బాదుడు 

12 Jun, 2020 09:13 IST|Sakshi

ఆరు రోజుల్లో రూ. 3.31 పెరిగిన పెట్రో ధర  

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు ధరలు  వరుసగా ఆరో రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారం ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్ ధరను లీటరుకు 57 పైసలు, డీజిల్ ధరను 59 పైసలు పెంచేసాయి. తాజా పెంపుతో  ఆరు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు  రూ. 3.31, డీజిల్ ధర లీటరుకు  రూ. 3.42  ఎగిసింది.  (పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే)
 
ప్రధాన నగరాల్లో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు
ఢిల్లీ : పెట్రోల్  రూ. 74.57 డీజిల్ రూ. 72.81
ముంబై: పెట్రోల్  రూ. 81.53. డీజిల్ రూ.71.48
చెన్నై: పెట్రోల్ రూ. 78.47. డీజిల్ రూ. 71.14
బెంగళూరు: పెట్రోల్ రూ.76.98. డీజిల్ రూ. 69.22

హైదరాబాద్: పెట్రోల్ రూ. 77.41. డీజిల్ రూ. 71.16
అమరావతి : పెట్రోల్ రూ.77.94, డీజిల్ రూ. 71.69

చదవండి : స్టాక్ మార్కెట్ భారీ పతనం

>
మరిన్ని వార్తలు