పెట్రో సెగ: మంచి రోజులు ఎపుడు?

14 Sep, 2018 08:38 IST|Sakshi

సాక్షి, ముంబై: పెట్రోలు, డీజిల్‌ ధరలకు అడ్డకట్ట పడే అవకాశం దరిదాపుల్లో కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఇంధన ధరల రోజువారీ సమీక్షలో భాగంగా  శుక్రవారం కూడా  ధరలు పెరిగి హై స్థాయిల్లో కొనసాగుతున్నాయి.  పెట్రోలుపై 28 పైసలు, డీజిల్‌ ధరలు 22 పైసలు పెరిగింది. ముఖ‍్యంగా వాణిజ్య రాజధాని ముంబైలో  ధరలు వినియోగదారుల్లో  ఆగ్రహాన్ని  రగిలిస్తున్నాయి. ముంబైలో  పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు  రూ .88.67,  రూ.77.82 గా ఉన్నాయి. దీంతో వినియోగదారులు  పెట్రో సెగపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.  అడ్డూ అదుపూ లేకుండా ఇంధన ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. బీజీపీ ప్రభుత్వం వాగ్దానం చేసిన ఆ  అచ్ఛేదిన్‌ ఎప్పుడొస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీలో  లీటరు పెట్రోలు ధర రూ. 81లు, డీజిల్‌ ధర రూ.73.30 గా ఉంది.  చెన్నైలో పెట్రోలు రూ.84.19, డీజిల్‌  ధర రూ.84.05.

హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.85.88గాను, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. కోలకతాలో పెట్రోలు రూ.82.87, డీజిల్‌ ధర రూ.82.74గా ఉంది.

మరిన్ని వార్తలు