మళ్లీ పెట్రో షాక్‌..

26 Jun, 2020 09:18 IST|Sakshi

ఇంధన ధరలు భారం

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో షాక్‌లు కొనసాగుతున్నాయి. శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 83 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు 80.13కు, డీజిల్‌ లీటర్‌కు 80.19 రూపాయలకు ఎగబాకింది.

ఇక పెట్రో భారాలపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నా ధరల సవరణ పేరుతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇంధన ధరలను మోతెక్కిస్తున్నాయి. కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రజలపై పెట్రో భారాలను మోపడం సరైంది కాదని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు పెట్రో ధరలను మించి డీజిల్‌ ధర పరుగులు తీయడంతో నిత్యావసరాల ధరలూ చుక్కలు చూస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

చదవండి : ‘పెట్రో’ మంట; వైర‌ల‌వుతున్న బిగ్‌బీ ట్వీట్‌

మరిన్ని వార్తలు