పెట్రోల్‌, డీజిల్‌ : వరుసగా ఆరో రోజూ...

26 Jun, 2018 11:44 IST|Sakshi
వరుసగా ఆరో రోజు తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ : వరుసగా ఆరో రోజూ దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోల్‌ ధరలు ఢిల్లీ, కోల్‌కత్తాలో 14 పైసలు, ముంబైలో 18 పైసలు, చెన్నైలో 15 పైసలు చొప్పున తగ్గినట్టు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ డేటాలో వెల్లడైంది. మంగళవారం తగ్గిన అనంతరం, లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.75.55గా, కోల్‌కత్తాలో రూ.78.23గా, ముంబైలో రూ.83.12గా, చెన్నైలో రూ.78.40గా ఉంది. పెట్రోల్‌ ధరలతో పాటు నేడు డీజిల్‌ ధరలు కూడా ఢిల్లీ, చెన్నై, కోల్‌కత్తాలో 10 పైసలు, ముంబైలో 12 పైసలు తగ్గాయి. తాజా ధరల సమీక్ష ప్రకారం లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.67.38గా, కోల్‌కత్తాలో రూ.69.93గా, ముంబైలో రూ.71.52గా, చెన్నైలో రూ.71.12గా నమోదైంది.

గరిష్ట స్థాయిల్లో ఎగిసిన ఇంధన ధరలు, మే 30 నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుంచి పెట్రోల్‌ ధరలు రూ.2.88 తగ్గగా.. డీజిల్‌ ధరలు రూ.1.93 క్షీణించాయి. అయితే అంతర్జాతీయంగా మాత్రం క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. లిబియాన్‌ ఇంధన ఎగుమతులపై అనిశ్చితి నెలకొనడంతో, అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ అంతర్జాతీయ బెంచ్‌ మార్క్‌ వద్ద 0.3 శాతం పెరిగి బ్యారల్‌కు 74.95 డాలర్లుగా నమోదైంది.
 

మరిన్ని వార్తలు