స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

25 Oct, 2018 10:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఇంధన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గురువారం వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్‌ ధరలు లీటర్‌కు 15 పైసలు తగ్గగా, డీజిల్‌ లీటర్‌కు 5 పైసలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగివస్తున్నాయి. ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌కు 76 డాలర్లకు తగ్గాయి.

ఈనెల ఆరంభంలో బ్యారెల్‌ ముడిచమురు ధర 86 డాలర్లకు ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇక గురువారం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ 85.98 కాగా, డీజిల్‌ ధర లీటర్‌కు రూ 81.36 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ రూ 81.10 కాగా, డీజిల్‌ లీటర్‌ రూ74.80గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర అత్యధికంగా రూ 86.58 కాగా, డీజిల్‌ లీటర్‌కు రూ 78.41 పలికింది. ముడిచమురు ధరలు తగ్గడంతో డాలర్‌తో రూపాయి విలువ బలపడింది. అక్టోబర్‌లో డాలర్‌తో రూపాయి మారకం రూ 74 దాటగా ప్రస్తుతం రూ 73.31గా నమోదైంది.

మరిన్ని వార్తలు