పెట్రో మంట : రూ. 91 దాటేసింది

1 Oct, 2018 08:30 IST|Sakshi

సాక్షి,ముంబై:  పెట్రోలు, డీజిల్ ధరలు  పెరుగుతూనే ఉన్నాయి.  అక్టోబర్‌ 1 సోమవారం పెట్రోలు ధర 24పైసలు డీజిల్‌  30పైసలు  పెరిగింది. న్యూఢిల్లీలో పెట్రోలు ధర  లీటరుకు 83.73 రూపాయలు. డీజిల్‌ ధర  లీటరు 75.09 రూపాయలు. ఇక వాణిజ్య రాజధాని ముంబైలో  పెట్రోల్, డీజిల్ ధరలు  రికార్డ్‌ స్థాయిని తాకి మరింత  సెగ రాజేస్తున్నాయి.  లీటరు పెట్రోలు ధర 91 రూపాయల  మార్క్‌నుదాటి  91.08 రూపాయల వద్ద వుంది. అలాగే 32పైసలు పెరిగిన డీజిల్‌ లీటరు ధర  రూ .79.72 గా ఉంది.

హైదరాబాద్‌లో  పెట్రోల్‌ లీటరు ధర రూ. 88.77గాను, డీజిల్‌ ధర 81.68 గా ఉంది.  విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.87.78, డీజిల్‌ ధర  రూ. 80.37.

మరోవైపు  దేశీయంగా  వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర  రూ .59 పెరిగింది. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.59 పెంచుతున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలో సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.59 పెంచామని వెల్లడించింది.

మరిన్ని వార్తలు