పెట్రోల్‌ ధరలపై అతిపెద్ద తగ్గింపు నేడే

8 Jun, 2018 08:41 IST|Sakshi
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : 16 రోజుల పాటు వరుసగా వినియోగదారులకు వాత పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు... గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గింపు బాట పట్టాయి. నేడు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించాయి. ఈ తగ్గింపు గత 10 రోజుల్లో పెట్రోల్‌ ధరలపై చేపట్టిన తగ్గింపులో అతిపెద్ద తగ్గింపని తెలిసింది. లీటరు పెట్రోల్‌పై 21 పైసలు, లీటరు డీజిల్‌పై 15 పైసలు తగ్గించినట్టు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. దీంతో లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో 21 పైసలు తగ్గి 77.42గా... లీటరు డీజిల్‌  ధర 15 పైసలు తగ్గి 68.58గా నమోదైంది. నేడు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో నమోదైన డేటాలో లీటరు పెట్రోల్‌ ధర ముంబైలో రూ.85.45గా, కోల్‌కతాలో రూ.80.28గా, చెన్నైలో రూ.80.59గా ఉన్నాయి. అదేవిధంగా డీజిల్‌ ధరలు కూడా ముంబైలో రూ.73.17గా, కోల్‌కతాలో రూ.71.28గా, చెన్నైలో రూ.72.56గా ఉన్నాయి. కాగ, గత 10 రోజుల్లో మొత్తం పెట్రోల్‌ ధర రూపాయి మేర తగ్గింది.

భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి ఇదే అతిపెద్ద కోత అని తెలిసింది. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకి తీసుకురావాలని, దీంతో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులను తేలికగా గమనించవచచ్చని కేంద్ర ఆయిల్‌ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ చెప్పిన ఒక్కరోజులోనే, ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌పై భారీగా కోత పెట్టాయి. మరోవైపు అంతర్జాతీయంగా కూడా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతుండటంతో, దేశీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. తొలుత ఒక్క పైసా, ఐదు పైసలు అలా తగ్గించిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇప్పుడు కాస్త పెంచి, రెండకెల్లో ధరలను తగ్గించాయి. కర్ణాటక ఎన్నికల అనంతరం వరుసగా 16 రోజుల పాటు ఎడతెరపి లేకుండా పెరుగుతూనే పోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌!

వొడాఫోన్‌ ఐడియా నష్టాలు 4,874 కోట్లు

కంపెనీల రవాణా సేవలకు ‘విజిల్‌’

లాభాల్లోకి పీఎన్‌బీ

ఊహించినట్టుగానే జీఎస్‌టీ తగ్గింపు

జియో జైత్రయాత్ర

మారుతీ లాభం 32 శాతం డౌన్‌

విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?

రిలయన్స్‌ ఫౌండేషన్‌ టీచర్‌ అవార్డులు

బయోకాన్‌ భళా!

4 శాతం ఎగిసిన బజాజ్‌ ఆటో ఆదాయం

ఆగని అమ్మకాలు : నష్టాల్లో మార్కెట్లు

నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్‌ ఫౌండర్స్‌

బీఓబీ లాభం రూ.826 కోట్లు

టాటా మోటార్స్‌ నష్టాలు 3,679 కోట్లు

డిసెంబర్‌ నాటికి వాట్సాప్‌ పేమెంట్‌ సేవలు

జెట్‌ రేసులో ఇండిగో!

ఆమ్రపాలి కుంభకోణం : ధోనీపై సంచలన ఆరోపణలు 

చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు

రూ.199కే నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ విడుదలపై క్లారిటీ

వరుస నష్టాలకు చెక్‌ : స్టాక్‌మార్కెట్లో కళ కళ

10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..

ఎగవేతదారులను వదలొద్దు

బ్యాంకింగ్‌ ‘బాండ్‌’!

‘ఇన్నోవేషన్‌’లో భారత్‌కు 52వ ర్యాంకు

హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!

ఆ ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ

ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్‌

అమెజాన్‌కు షాక్‌: నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్లాన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు