మూడో రోజు తగ్గిన పెట్రో ధరలు

18 Jan, 2020 15:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  పెట్రోల్, డీజిల్ ధరలు  వరుసగా మూడు రోజుకూడా తగ్గుముఖం పట్టాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు  ధరల తగ్గింపుతో శనివారం మరో 15 పైసలు  దిగి వచ్చింది. దీంతో ఈ మూడు రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్ లీటరుకు 44 పైసలు, డీజిల్‌పై లీటరుకు 45 పైసల ఉపశమనం లభించింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధరలను లీటరుకు 15 పైసలు తగ్గా, ఢిల్లీ కోల్‌కతాలో డీజిల్ ధరను 16 పైసలు తగ్గింది. ముంబై, చెన్నైలలో లీటరుకు 17 పైసలు తగ్గించడం గమనార్హం.

ఇండియన్‌ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం   పలు నగరాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ : లీటరు పెట్రోలు ధర రూ. 75.26,లీటరు డీజిల్‌ ధర 68.61
 కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. రూ .77.85 లీటరు డీజిల్‌ ధర రూ .70.97
ముంబై:  లీటరు పెట్రోలు రూ .80.85  లీటరు డీజిల్‌ ధర  రూ .71.94
 చెన్నై :   లీటరు పెట్రోలు  రూ .78.19  లీటరు డీజిల్‌ ధర   రూ .72.50 

హైదరాబాద్‌ : లీటరు పెట్రోలు రూ .80.03 లీటరు డీజిల్‌ ధర రూ .74.81
విజయవాడ లీటరు పెట్రోలు రూ .79.20  లీటరు డీజిల్‌ ధర రూ .73.66

మరిన్ని వార్తలు