14వ రోజు: పెట్రోల్‌ ధర ఎంత తగ్గింది?

12 Jun, 2018 08:32 IST|Sakshi

సాక్షి, ముంబై:  వినియోగదారులకు చుక్కలు  చూపించిన పెట్రోల్‌ ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.ఇటీవల రికార్డ్‌ స్థాయిలను తాకిన ఇంధన ధరలు వరసగా 14వ రోజు మంగళవారం కూడా   స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి.  పెట్రోల్‌పై 15పైసలు, డీజిల్‌ పై  10పైసల చొప్పున ధరలు క్షీణించాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ వెబ్‌సైట్‌ అందించిన సమాచారం ప్రకారం ఢిల్లీ, కోలకతా, ముంబై, చెన్నైతదితర మెట్రో నగరాల్లో  పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 15,11 పైసలు  తగ్గాయి. ఈ సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 76.43 రూపాయలుగా ఉంది. కోలకతాలో రూ.79.10 ముంబైలో రూ. 84.26, చెన్నైలో రూ. 79.33  రూపాయలుగా ఉంది.

ఇక డీజిల్‌ ధర విషయానికి వస్తే  కోల్‌కతా, ఢిల్లీలో డీజిల్ ధరలు లీటరుకు 10 పైసలు తగ్గగా ముంబయి, చెన్నైలలో  లీటరుకు 11 పైసలు తగ్గింది. హైదరాబాద్‌ లీటర్‌ పెట్రోల్‌ ధర 16 పైసలు తగ్గి రూ.80.96గా ఉండగా,  డీజిల్‌ ధర  11 పైసలు తగ్గి రూ. 73.75గా ఉంది.  జూన్‌ 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. గత 14 రోజులుగా పెట్రోల్‌ ధర లీటరుకు దాదాపు రెండు రూపాయలు తగ్గింది. డీజిల్‌ ధర రూ1.50 తగ్గింది.

మరిన్ని వార్తలు