ఇక పెట్రో బాదుడు షురూ?

13 Dec, 2018 14:51 IST|Sakshi

అటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగింపు

ఇటు  పెట్రో ధర పెంపు

రెండు నెలల్లో తొలిసారిగా 11పైసలు పెరిగిన పెట్రో ధర

సాక్షి, ముంబై: గత రెండు నెలలుగా ఊరట చెందిన వినియోగదారుల నెత్తిన పెట్రో భారం మళ్లీ మొదలైంది.  అయిదు  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరుణంలో మళ్లీ పెట్రో ధరలు పెరుగుదలను నమోదు చేశాయి.  ముఖ్యంగా అంతర్జాతీయంగా ఈ వారంలో 2శాతం క్రూడ్‌ ధర క్షీణించగా,  గత రెండు నెలల్లో 30శాతం  తగ్గింది. అయినా  దేశీయంగా  పెట్రో బాదుడు షురూ కావడం  గమనార్హం.

తాజాగా పెట్రోలు పై 11 పైసలు ధర పెరిగింది.  అయితే డీజిల్ ధర స్థిరంగా ఉంది. దీంతో  గత రెండు రోజులుగా స్ధిరంగా కొనసాగిన పెట్రోల్ ధరలు దేశ రాజధాని ఢిల్లీలో 9 పైసలు పెరిగి రూ.70.29 కి చేరింది. అటు వరసగా మూడో రోజు కూడా స్థిరంగా ఉన్న డీజిల్ ధర రూ.64.66 వద‍్ద యథాతథంగా కొనసాగుతోంది.

ముంబైలో పెట్రోలు ధర 11 పైసలు పెరిగి రూ.75.91 ఉండగా..డీజిల్ ధర రూ.67.66 గా ఉంది.
కోలకతా : పెట్రోలు ధర రూ. 72.38 , డీజిలు ధర రూ. 66.40
చెన్నై: పెట్రోలు ధర రూ. 72.94 డీజిలు ధర రూ. 68.26
హైదరాబాద్‌: పెట్రోలు ధర  రూ.74.55. డీజిల్ ధర రూ70.26 .
విజయవాడ: పెట్రోలు ధర రూ. 73.99. డీజిలు ధర రూ. 69.36

కాగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌ 4న చారిత్రక గరిష్టాలను నమోదు చేశాయి.  అయితే ప్రభుత్వం జోక్యంతో  అక్టోబర్‌ 16నుంచి  పెట్రో ధరల దూకుడుకు కళ్లెం  వేసింది. అటు అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు దిగి రావడంతో రెండు నెలలుగా దేశీయ ఇంధన ధరలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు