12వ రోజూ తగ్గిన పెట్రోల్‌ ధర

11 Jun, 2018 08:15 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌,డీజిల్‌ ధరలపై ప్రజలకు స్వల్ప ఉపశమనం కలిగించాయి.  వరుసగా పన్నెండో రోజూ పెట్రోల్‌ ధరలు  తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రస్తుతం న్యూఢిల్లీలో  ఆదివారం లీటరు పెట్రోల్ ధర  24 పైసలు తగ్గి 76.78గా   ఉంది.  కోల్‌కతాలో 24పైసలు తగ్గగా.. చెన్నైలో 26పైసలు, ముంబయిలో 23పైసలు తగ్గింది. వరుసగా పన్నెండో రోజు కూడా  పెట్రోల్‌ధర తగ్గుముఖం పట్టడంతో   పట్రోల్‌ లీటరు ధర  ముంబైలోరూ.84.61 గా, కోలకతాలో రూ.79.44,  చెన్నైలో రూ.79.95 గా ఉంది. దీంతో ఇప్పటి వరకూ పెట్రోల్‌ ధరలు లీటరుపై దిల్లీలో రూ.1.65, కోల్‌కతాలో రూ.1.62, ముంబయిలో రూ.1.63, అత్యధికంగా చెన్నైలో రూ.1.74 తగ్గింది.

హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ. రూ. 81.33గా ఉండగా ఇతర నగరాల్లో బెంగుళూరులో రూ. 78.03, భోపాల్‌ రూ. రూ .75.60, భువనేశ్వర్‌లో రూ. 75.60, చండీగఢ్‌లో రూ. 73.84, డెహ్రాడూన్‌లోరూ. 78.04, జైపూర్‌లోరూ. 79.53, లక్నోలో రూ. 77.52, పాట్నా, రాయపూర్‌లో రూ. 77.18,  శ్రీనగర్లో రూ. 81.19.గా వుంది.

డీజిల్‌ ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ఆదివారం 18పైసలు వరకూ ధర తగ్గింది. ముంబయి, చెన్నైలో 19 పైసలు తగ్గి లీటరు  ధర రూ. 68.10, కోల్‌కతాలో రూ.70.65, ముంబయిలో రూ. 72.51, చెన్నైలో రూ. 71.89కు చేరింది. నిన్న రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్‌పై 40-42 పైసలు తగ్గిన విషయం తెలిసిందే. అలాగే గత పదిరోజుల్లో పెట్రోల్‌ ధర ఒక రూపాయి  తగ్గింది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌లో 76.69డాలర్లుగా  ఉంది.

మరిన్ని వార్తలు