తగ్గిన పెట్రోలు ధర : ఢిల్లీలో రూ.80 దిగువకు

3 Nov, 2018 09:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా  చమురు ధరలు క్షీణిస్తుండటంతో దేశీయంగా వాహనదారులకు పెట్రో ధరలు భారీ ఊరటనిస్తున్నాయి. క్రమంగా తగ్గుముఖం పడుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం (నవంబరు 3) కూడా దేశీయంగా తగ్గాయి.  పెట్రోల్‌ పై 19పైసలు, డీజిల్‌పై 12పైసలు ధర  తగ్గింది. దీంతో  దేశ రాజధాని ఢిల్లీలో 80రూపాయల దిగువకు చేరింది. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోలు ధర రూ.78.99 వద్ద ఉంది. డీజిల్ ధర 11 పైసలు తగ్గి రూ.73.53 కి చేరింది.  అలాగే వాణిజ్య రాజధాని ముంబైలో 19 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.84.49 కి చేరగా.. డీజిల్ ధర 12 పైసలు తగ్గి రూ.77.06 కి చేరింది. 

హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ 21 పైసలు తగ్గి రూ.83.75లుపలుకుతుండగా, డీజిల్ ధర 12 పైసలు తగ్గి రూ.80 కి చేరింది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.82.94 ఉండగా, డీజిల్‌ ధర రూ.78.75 వద్ద కొనసాగుతోంది.  అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరింత తగ్గి 72.83 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 

కోల్‌కతా : పెట్రోలు ధర లీటరు.రూ. 80.89.  డీజిల్‌ ధర రూ. 75.39
చెన్నై: పెట్రోలు ధర లీటరు.రూ. 82.06.డీజిల్‌ ధర రూ. 77.73
బెంగళూరు :   పెట్రోలు ధర లీటరు. 79.63. డీజిల్‌ ధర రూ. 73.93

మరిన్ని వార్తలు