స్వల్పంగా దిగివచ్చిన పెట్రో ధరలు

15 Mar, 2020 14:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ముడిచమురు ధరలు భారీగా పతనమవడంతో చమురు కంపెనీలు దేశీ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆదివారం స్వల్పంగా తగ్గించాయి. లీటర్‌ పెట్రోల్‌ ధరను 12 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 14 పైసల మేర కోత విధించాయి. ఆయిల్‌ కంపెనీల నిర్ణయంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ 74.38కి తగ్గింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ రూ 69.75కు దిగివచ్చింది. ఢిల్లీలో డీజిల్‌ ధర రూ 62.44 పలికింది. ఇతర నగరాలతో పోలిస్తే పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారం తక్కువగా ఉండటంతో ఢిల్లీలోనే పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనమైనా కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ 3 పెంచడంతో ఆ ప్రయోజనాలను ఆయిల్‌ కంపెనీలు పూర్తిగా వినియోగదారులు మళ్లించలేకపోయాయి. ఎక్సైజ్‌ సుంకాల పెంపు భారాన్ని రికవరీ చేసుకున్న మీదట ముడిచమురు ధరల తగ్గుదల ప్రయోజనాలను ఆయిల్‌ కంపెనీలు వినియోగదారులకు అందిస్తాయని చెబుతున్నారు.

చదవండి : పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు

మరిన్ని వార్తలు