పెట్రో షాక్‌: ఆ పట్టణంలో అత్యధిక ధర

10 Sep, 2018 13:58 IST|Sakshi

సాక్షి, ముంబై : పెట్రోల్‌ ధరలు రికార్డు స్ధాయిలో భగ్గుమంటుంటే మహారాష్ట్రలోని పర్బాని పట్టణంలో దేశంలోనే అత్యధికంగా లీటర్‌ పెట్రోల్‌ రూ 89.97కు చేరి రికార్డు సృష్టించింది. పెట్రోల్‌ ధరలు తమ ప్రాంతంలో సోమవారం లీటర్‌కు రూ 90కు చేరువగా, డీజిల్‌ లీటర్‌కు రూ 77.92 పలికిందని పర్బాని జిల్లా పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. ఇక మహారాష్ట్ర అంతటా పెట్రోల్‌ ధరలు రూ 88, డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ 76 పలికాయని అఖిల భారత పెట్రోల్‌ డీలర్ల అసోసియేషన్‌ ప్రతినిధి అలి దరువాలా పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పిలుపు మేరకు పెట్రో ధరల పెంపునకు నిరసనగా భారత్‌ బంద్‌లో భాగంగా మహారాష్ట్రలో బంద్‌ కొనసాగుతోంది. పాలక బీజేపీ-శివసేన మినహా అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. ముంబైలోని అంథేరి స్టేషన్‌ వెలుపల మహారాష్ట్ర కాం‍గ్రెస్‌ చీఫ్‌ అశోక్‌ చవాన్‌, ముంబై కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.

మరిన్ని వార్తలు