పెట్రోల్‌ బంకులు భారీగా పెరిగాయ్‌..

30 Nov, 2017 01:19 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌ బంకుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. గత ఆరేళ్లలో (2011–2017) వీటి సంఖ్యలో 45 శాతంమేర వృద్ధి నమోదయ్యింది. దీన్ని ప్రపంచంలోనే గరిష్ట వృద్ధిగా భావించొచ్చు. భారత్‌లో అక్టోబర్‌ చివరి నాటికి పెట్రోల్‌ బంకుల సంఖ్య 60,799గా ఉంది. 2011లో వీటి సంఖ్య 41,947. 2011–2017 మధ్యకాలంలో పెట్రోల్‌ బంకుల సంఖ్య 18,852 మేర పెరిగింది. అమెరికా, చైనా తర్వాత భారత్‌లోనే పెట్రోల్‌ బంకులు ఎక్కువ. చమురు శాఖ గణాంకాల ప్రకారం.. రిలయన్స్, ఎస్సార్‌ ఆయిల్‌ వంటి ప్రైవేట్‌ సం స్థలకు 5,474(9%) పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిల్లో ఎస్సార్‌కు అధిక వాటా ఉంది. ఈ సంస్థకు 3,980 బంకులున్నాయి. ఇక ప్రభుత్వ రంగ చమురు రిటైలర్ల పెట్రోల్‌ బంకుల సంఖ్య 55,325. ఐఓసీకి అత్యధికంగా 26,489 పెట్రోల్‌ బంకులున్నాయి. అమెరికా, చైనాలలో లక్ష చొప్పున పెట్రోల్‌ బంకులు ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు