ఇక ఆ వెబ్‌సైట్‌లోనూ పెట్రోల్‌ దొరుకుతుంది

27 Sep, 2017 20:26 IST|Sakshi

ఇక త్వరలోనే ప్రతి పెట్రోలియం ఉత్పత్తులు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లలోనూ లభ్యం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అనుమతులు లభించాయని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. తాను ఈ ఆలోచనను తెరపైకి తీసుకొచ్చినప్పుడు అందరూ తనని అనుమానస్పదంగా చూశారని, కానీ ప్రస్తుతం ఇది అమల్లోకి రాబోతున్నట్టు చెప్పారు. న్యూఢిల్లీలో నేటి నుంచి ప్రారంభమైన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ ఆలోచనను  ఏప్రిల్‌ 21నే ​శ్రీనగర్‌లో జరిగిన పార్లమెంట్ సభ్యుల సంప్రదింపుల సంఘంలో ప్రధాన్‌ మొదటిసారి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలను పెంచడానికి ఇంధనాన్ని హోమ్‌ డెలివరీ కూడా చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ చూస్తోంది.

హోమ్‌ డెలివరీతో బంకుల వద్ద భారీ ఎత్తున్న క్యూలను నిర్మూలించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రెండు నెలల్లో డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని లాంచ్‌ చేస్తామని గత నెలలో ఆయిల్‌ మార్కెటింగ్‌ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చెప్పింది. ప్రస్తుతం పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ నుంచి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఆమోదం పొందాల్సి ఉంది. రోజువారీ దేశవ్యాప్తంగా లక్ష రిటైల్‌ అవుట్‌లెట్లకు 40 మిలియన్‌ వినియోగదారులు వస్తున్నారు.   

మరిన్ని వార్తలు