జోరుగా ఫార్మా రంగ షేర్ల ర్యాలీ

4 Jun, 2020 10:55 IST|Sakshi

ఫార్మా రంగానికి చెందిన షేర్లు గురువారం ఉదయం సెషన్‌లో జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లోనూ ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ దాదాపు 2.50శాతం లాభపడింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఫార్మా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడంతో అరబిందో ఫార్మా షేరు ఇండెక్స్‌ ఏడాది గరిష్టాన్ని తాకింది. సన్‌ఫార్మా, బయోకాన్‌ షేర్లు 3శాతం పెరిగాయి. సిప్లా, లుపిన్‌, గ్లెన్‌మార్క్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. దివీస్ ల్యాబ్స్‌, డాక్టార్‌ రెడ్డీస్‌, కేడిలా హెల్త్‌కేర్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. అయితే ఒక్క పిరమిల్‌ఎంటర్‌ప్రైజెస్‌లిమిటెడ్‌ షేరు మాత్రం 3శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. 

ఉదయం గం.10:45ని.లకు నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2శాతం లాభంతో 9,880.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దాదాపు ఏడాదిన్నర తరువాత నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ తిరిగి 10వేల స్థాయిని అందుకుంది. ఇదే సమయానికి సిప్లా, సన్‌ఫార్మా షేర్లు వరుసగా 2శాతం, 3శాతం లాభపడి నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 షేర్లలో చోటు దక్కించుకున్నాయి.

మరిన్ని వార్తలు