విస్తరణ బాటలో మెడ్ ప్లస్

6 May, 2016 02:11 IST|Sakshi
విస్తరణ బాటలో మెడ్ ప్లస్

ఫ్రాంచైజీ మోడల్ విధానంలో ఏపీ, తెలంగాణలో..
1,100 స్టోర్ల విస్తరణ లక్ష్యం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మెడ్‌ప్లస్ సంస్థ విస్తరణ బాట పట్టింది. తొలి దశలో భాగంగా ఏపీ, తెలంగాణల్లో 1,100 స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫ్రాంచైజీ విధానం ద్వారా రెండు రాష్ట్రాల్లోని జిల్లా, మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మెడ్‌ప్లస్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ మధుకర్ గంగాడీ గురువారం ఒక ప్రక టనలో తెలిపారు.

ఒక్కో స్టోర్ ఏర్పాటుకు 300-500 చ.అ. స్థలం, దాదాపు రూ.15-20 లక్షల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ పెట్టుబడిలో ఫ్రాంచైజీ, అద్దె డిపాజిట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టాక్ ఏర్పాటు వంటివన్నీ కలిసే ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం పెట్టుబడిలో 70% వరకూ రుణాన్ని అందించేందుకు గాను ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు