భారత్‌కు మొండిబకాయిల సమస్య: ఓఈసీడీ

21 Nov, 2015 01:39 IST|Sakshi
భారత్‌కు మొండిబకాయిల సమస్య: ఓఈసీడీ

కౌలాలంపూర్: వర్థమాన ఆసియా దేశాల్లో భారత్ వృద్ధి స్థాయిలు బాగున్నాయని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని, 2016-17లో ఈ రేటు 7.3 శాతానికి మెరుగుపడే అవకాశం ఉందని వివరించింది.  2016-20 మధ్య భారత్‌లో సగటు వృద్ధి రేటును 7.3 శాతంగా అంచనా వేస్తోంది. కాగా భారత్ వృద్ధి బాటలో బ్యాంకింగ్ మొండిబకాయిల అంశం ఒక సవాలని తన తాజా విశ్లేషణా పత్రం ప్రకారం.

2015లో వర్థమాన ఆసియా దేశాల వృద్ధి రేటు 6.5 శాతం. 2016 నుంచి 20 వరకూ ఈ రేటు సగటున 6.2%గా ఉంటుంది. భారత్ వృద్ధి ధోరణి కొనసాగుతుంటే... చైనా నెమ్మదిస్తుంది. ఆసియాన్ ప్రాంతం 2015లో 4.6% వృద్ధి రేటు సాధిస్తుంది.

>
మరిన్ని వార్తలు