పేటీఎంకు రివర్స్‌ పంచ్‌ ఇచ్చిన ఫోన్‌పే

8 Mar, 2020 19:04 IST|Sakshi

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారిటోరియం విధించి, ఒక్కో వినియోగదారుడు నెలకు రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకోవచ్చని ఆంక్షలు విధించింది. ఈ నిబంధన వల్ల ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్‌పే ఇబ్బందుల్లో పడింది. ఆంక్షల నేపథ్యంలో డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఫోన్‌ఫేను తన యూపీఐ ప్లాట్‌ఫామ్‌లోకి ఆహ్వానిస్తు.. తన సేవలను వినియోగించుకోవాలని, ఫోన్‌పే అవసరాలకు అనుగుణంగా తమ సేవలను విస్తరించగలమంటూ పేటీఎమ్‌ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌కు దీటుగా ఫోన్‌పే బదులిస్తు మీరు చెబుతున్నట్టు మీ సేవల సామర్థ్యాన్ని విస్తరించడం సాధ్యమనుకుంటే ముందుగానే మీమ్మల్ని సంప్రదించే వాళ్లమని పేటీఎమ్‌కు గట్టి పంచ్‌ ఇచ్చింది. ఫార్మ్‌ అనేది శాశ్వతం కాదని..కానీ క్లాస్‌ అనేది ఎప్పటికి శాశ్వతం అని ఫోన్‌పేకు పేటీఎమ్‌ దీటుగా తమ వాదన వినిపించింది.


 

మరిన్ని వార్తలు