ఫోన్‌పేలో కొత్త ఫీచర్‌

3 Feb, 2020 14:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే వినియోగదారుల సౌలభ్యం కోసం సరికొత్త వెసులు బాటునుకల్పించింది. తన ప్లాట్‌ఫాంలో లావాదేవీలను మరింత  సులువుగా  జరుపుకునేలా వినియోగదారులకు  చాట్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలలో చాట్‌ ఫీచర్‌ను ప్రారంభించింది.

ఈ ఫీచర్ ద్వారా, యూజర్లు ఇప్పుడు మరే ఇతర మెసేజింగ్ అనువర్తనం అవసరం లేకుండా డబ్బును అడగడం లేదా ధృవీకరణ కోసం చెల్లింపు రసీదును కూడా సెండ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌పే చాట్ ద్వారా వినియోగదారులు, అవతలివారితో  చాట్‌ చేస్తూ ట్రాన్సాక్షన్‌ పూర్తి చేయవచ్చు. అలాగే ఈ  చాట్‌కు  సంబంధించిన  చాట్‌ హిస్టరీ  కూడా ‘చాట్‌ ఫ్లో’ లో డిస్‌ ప్లే అవుతుంది. దీంతో ఆ తరువాత లావాదేవీ కూడా సులభం అవుతుంది. తమ చాట్‌ ఫీచర్‌  తమ కస్టమర్లకు చాలా ఆకర్షణీయమైన అనుభవంగా మారుతుందని ఫోన్‌పే అని సహ వ్యవస్థాపకుడు, సీటీవో రాహుల్ చారి ఒక ప్రకటనలో తెలిపారు.  రాబోయే వారాల్లో ఫోన్‌పే చాట్‌ను గ్రూప్ చాట్  ఫీచర్‌తో మరింత మెరుగుపరుస్తామని చారి తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల కోసం వారం క్రితం లాంచ్ చేసిన ఈ ఫీచర్ 185 మిలియన్ల ఫోన్‌పే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది.

ఫోన్‌పే యాప్‌లో ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి?

  • యాప్‌ను ఓపెన్‌ చేసి కాంటా‍క్ట్‌ లిస్ట్‌ నుంచి సంబంధిత  కాంటాక్ట్‌ నెంబరును ఎంచుకోవాలి
  • ఇక్కడ రెండు ఆప్లన్లు ఉంటాయి.  1. చాట్‌ 2. సెండ్‌
  • చాటింగ్‌ కోసం చాట్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • నగదు పంపడానికి సెండ్‌ అనే ఆప్షన్‌ ఎంచుకొని, నగదును పంపొచ్చు.
మరిన్ని వార్తలు