కార్యాలయాల ఫొటోలు,  భౌగోళిక వివరాలు ఇవ్వాల్సిందే

23 Feb, 2019 01:21 IST|Sakshi

కంపెనీలకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: కంపెనీలు తమ రిజిస్టర్డ్‌ కార్యాలయాల ఫొటోలు, భౌగోళికంగా ఎక్కడున్నదీ తెలియజేసే రేఖాంశ, అక్షాంశ వివరాలను తెలియజేయడం త్వరలోనే తప్పనిసరికానుంది. షెల్‌ కంపెనీలను (అక్రమ నగదు లావాదేవీల కోసం ఏర్పాటయ్యేవి) ఏరిపారేసే కార్యక్రమంలో భాగంగా కేంద్రం నూతన ఫామ్‌ యాక్టివ్‌–1ను నోటిఫై చేసింది. 2017 డిసెంబర్‌ 31నాటికి కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వద్ద నమోదై ఉన్న కంపెనీలు వచ్చే ఏప్రిల్‌ 25లోగా ఫామ్‌ యాక్టివ్‌–1ను సమర్పించాల్సి ఉంటుంది.

గడువులోపు ఈ పత్రాన్ని దాఖలు చేయని కంపెనీలు రూ.10,000 ఆలస్యపు ఫీజుతో దాఖలు చేయవచ్చు. కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కంపెనీ, దాని వెనుక ఉన్న వారి వివరాలను తెలుసుకునేందుకు ఈ నోటిఫికేషన్‌ పెద్ద ముందడుగుగా ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. కంపెనీల కార్యాలయాల ఫొటోలను, రేఖాంశ, అక్షాంశాల వివరాలను కోరడం ఇదే మొదటిసారిగా తెలిపారు. రిజిస్టర్‌ కార్యాలయం ఫొటోతోపాటు, ఒక డైరెక్టర్‌ లేదా యాజమాన్యంలోని ఒక కీలకమైన వ్యక్తి ఫొటోను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు కంపెనీల చట్టం 2013కు చేసిన సవరణలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్పారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ రద్దయినవి, రద్దయ్యే ప్రక్రియలో ఉన్నవి,  

మరిన్ని వార్తలు