వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్‌ పిచాయ్‌

27 Oct, 2019 16:00 IST|Sakshi

వాషింగ్టన్‌: వివాదాస్పద అంశాల చర్చ విషయంలో తమ కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ప్రయాణ నిషేధ నిర్ణయాన్ని సమర్థించిన సెక్యూరిటీ అధికారి మైల్స్ టేలర్‌ను గూగుల్‌ నియమించడాన్ని సమర్థించారు. తాజాగా పిచాయ్‌ మాట్లాడుతున్న ఓ వీడియో లీకైంది. గురువారం పిచాయ్‌, నిపుణుల సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగుల నమ్మకాన్ని సంస్థ కోల్పోయిందని అంగీకరించారు. ఉద్యోగుల అసంతృప్తిని పరిష్కరించే మార్గాలను చర్చించారు.  గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కరన్‌ భాటియా మాట్లాడుతూ టైలర్‌ను ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో కాకుండా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, జాతీయ భద్రతను పెంపొందించే అంశాలలో అతని సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. 

ఈ క్రమంలో ఉద్యోగులు వివాదాస్పద రాజకీయ అంశాలను, కించపరిచే అంశాలను చర్చించొద్దని ఈ వేసవిలో కంపెనీ ఓ మెమోను జారీ చేసింది. అయితే ఎప్పటకప్పుడు ఉద్యోగుల ఫోరమ్‌లను పర్యవేక్షిస్తామని తెలిపింది. గూగుల్‌ అధికారి బరోసో మాట్లాడుతూ ఫోరమ్‌ల కంటే సాఫ్టవేర్‌ను ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. కంపెనీలో అసభ్య ప్రవర్తన, రహస్య సమాచారాన్ని లీక్‌ చేయడం స్పష్టమైన కంటెంట్ లేకపోవడం వంటి అంశాలను సాఫ్టవేర్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా