పెళ్లి చేస్తారు.. రిటైరవుతారు!

7 May, 2018 01:49 IST|Sakshi

ఒకదాని వెంటనే మరొకటి కూడా రావచ్చు

రెండింటికీ తగ్గట్టుగా ప్రణాళిక తప్పనిసరి

రోజురోజుకూ పెరుగుతున్న వివాహ ఖర్చులు

ప్రతి నెలా భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు

రెండింటికీ వేర్వేరు ప్రణాళికలు అవసరం  

సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం :  పెళ్లి ఎలా చెయ్యాలి? తల్లిదండ్రులందరికీ... ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకిది పెద్ద సవాలే. నిజానికి పెళ్లి ఎలా అయినా చెయ్యొచ్చు. దానికి ఎంతయినా ఖర్చు పెట్టొచ్చు. తక్కువలో తక్కువగా వేలల్లో ముగించేయొచ్చు. అట్టహాసంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనూ వచ్చు. ఇవన్నీ పక్కనబెడితే... మధ్య తరగతి కుటుంబాల్లో... పెళ్లనేది చాలావరకూ వరుడి కుటుంబీకుల ఇష్టప్రకారం చేయాల్సి ఉంటుంది.

సదరు సంబంధం కావాలనుకుంటే దానికి తగ్గట్టు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కూడా.  నిజానికి పెళ్లికి ముందు నుంచే సన్నద్ధం అయ్యేవారు మనలో చాలా తక్కువ. మునుపటికన్నా ఇపుడు వివాహానికి ప్రాధాన్యం పెరిగింది. దాంతోనే ఖర్చులూ పెరిగాయి. అందుకని ముందు నుంచే ప్రణాళిక వేసుకుని... ఆ మేరకు పిల్లల వివాహ అవసరాల కోసం కొంత నిధిని సమకూర్చుకోవడం తప్పనిసరి.

ఉదాహరణకు రాజమండ్రికి చెందిన సుకుమార్‌నే తీసుకుంటే... తనకు 17 ఏళ్ల ఇంటర్‌ చదివే కుమార్తె ఉంది. ఉన్నత విద్య పూర్తయ్యాక ఆమెకు పెళ్లి చేయాలన్నది సుకుమార్‌ ఆలోచన. ఆమె పెళ్లికి సుమారు 8–10 ఏళ్ల వ్యవధి ఉంది. అలాగే, తన రిటైర్మెంట్‌ జీవితం కోసం కూడా కొంత నిధిని సమకూర్చుకోవాలని భావించాడు. ఇందుకు మరో పదేళ్ల వ్యవధి ఉంది. దీనికి ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నది నిపుణుల సూచనల ఆధారంగా ఒకసారి చూద్దాం...

వివాహం కోసం ఏం చేయొచ్చంటే...
హరిత వివాహ అవసరాల కోసం రూ.25 లక్షలను సమకూర్చుకోవాలన్నది సుకుమార్‌ లక్ష్యం. అది కూడా ఇప్పటి ఖర్చుల ఆధారంగా అతడు వేసుకున్న అంచనా. 8 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా చూస్తే మరో ఎనిమిదేళ్ల తర్వాత హరిత వివాహ సమయానికి రూ.46 లక్షలు అవసరం అవుతాయి. సుకుమార్‌ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ప్రతీ నెలా కనీసం రూ.25,000 పింఛను రూపంలో వస్తుందని అతడి అంచనా. అయినా సరే... రిటైర్మెంట్‌ తర్వాత అనూహ్యంగా వచ్చే అవసరాల కోసం అతను రూ.1.5 కోట్లు సమకూర్చుకోవాలనుకుంటున్నాడు.  


ప్రణాళిక ఇలా ఉండాలి
సుకుమార్‌ ప్రతి నెలా తీసుకునే వేతనం రూ.60,000. అదృష్టవశాత్తూ సుకుమార్‌ అర్ధాంగి జ్యోతి కూడా ఉద్యోగే. ఆమె నెలసరి వేతనం రూ.40,000. వీరి నెలసరి కుటుంబ ఖర్చు రూ.50,000. దీంతో ప్రతి నెలా వారి మిగులు నిధులు రూ.50,000. ఇందులో రూ.45,000ను బ్యాంక్‌ రికరింగ్‌ డిపాజిట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుండగా, మిగిలిన రూ.5,000ను ఈక్విటీ బ్యాలెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. వీరి కుమార్తె హరిత ఇంటర్‌ చదువుతోంది.

తరవాత ఇంజనీరింగ్‌ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఇక సుకుమార్‌కు రూ.కోటి మేర టర్మ్‌ బీమా పాలసీ ఉంది. దీన్ని ఆయన పనిచేస్తున్న సంస్థే సమకూర్చింది. వైద్య బీమా పాలసీ కూడా సంస్థ అందిస్తున్నదే ఉంది. మరో పదేళ్లలో సుకుమార్‌ రిటైర్‌ అవుతారు. కనుక తర్వాత అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విడిగా ఓ వైద్య బీమా పాలసీ ఇప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్‌ తర్వాత ఆ వయసులో వైద్య బీమా పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది.


పెట్టుబడులు, మార్పులు...
సుకుమార్‌కు ప్రస్తుతం రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాలో రూ.25 లక్షలున్నాయి. బ్యాంకు ఎఫ్‌డీల రూపంలో రూ.40 లక్షలున్నాయి. సొంత ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. దీని విలువ రూ.1.15 కోట్లు. సుకుమార్‌ పెట్టుబడుల్లో సింహభాగం రికరింగ్‌ డిపాజిట్లకే వెళుతోంది. అతని కుమార్తె వివాహానికి ఇంకా కనీసం ఎనిమిదేళ్ల వ్యవధి ఉంది. కనుక పెట్టుబడుల్లో కొంత మేర అధిక రాబడులకు కేటాయించుకోవచ్చు. రూ.50,000 పెట్టుబడుల్లో కనీసం రూ.30,000ను ఈక్విటీ బ్యాలన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్, లార్జ్‌క్యాప్‌ ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవాలి. మిగిలిన రూ.20,000ను ఆర్డీకి మళ్లించొచ్చు.

బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లోనూ మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న వాటినే ఎంచుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ ఫండ్, ఎల్‌అండ్‌టీ ఇండియా ప్రుడెన్స్‌ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ పథకాలు బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌కు పనితీరు పరంగా మంచి చరిత్ర ఉంది. లార్జ్‌క్యాప్‌ డైవర్సిఫైడ్‌ పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫ్రంట్‌లైన్‌ ఈక్విటీ, మిరే అస్సెట్‌ ఇండియా ఈక్విటీ, ఇన్వెస్కో ఇండియా గ్రోత్‌ ఫండ్‌ పథకాలను పరిశీలించొచ్చు.

ఈ విధంగా పెట్టుబడులు పెడితే వార్షికంగా 12 శాతం రాబడి అంచనాల మేరకు 2026 నాటికి రూ.48.5 లక్షలు సమకూరుతుంది. దీంతో సుకుమార్‌ కుమార్తె హరిత వివాహ అవసరాలకు సరిపడా నిధి చేతికి అందుతుంది. ఇక రికరింగ్‌ డిపాజిట్‌లో ప్రతీ నెలా చేసే రూ.20,000 పెట్టుబడి సైతం 2028 నాటికి రూ.34 లక్షలు అవుతుంది. వార్షికంగా 7 శాతం రాబడుల ఆధారంగా వేసిన అంచనా ఇది.

ఇక బ్యాంకు ఎఫ్‌డీల్లో ఉన్న రూ.40 లక్షలను కదపకుండా అలానే కొనసాగిస్తే 7 శాతం రాబడి ఆధారంగా 2028 నాటికి (సుకుమార్‌ రిటైర్మెంట్‌ అయ్యే సంవత్సరం) రూ.78.7 లక్షలు అవుతాయి. అలాగే, ప్రస్తుతం రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాల్లో ఉన్న రూ.25 లక్షలను కూడా లార్జ్‌క్యాప్‌ డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీంతో పదేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.77.6 లక్షలు అవుతాయి. దీంతో ఈ మొత్తం కలిపి సుకుమార్‌ రిటైర్మెంట్‌ నాటికి రూ.1.9 కోట్లు అవుతాయి.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'