ప్లేబోయ్ భవంతిని అమ్మేశారట..!

7 Jun, 2016 18:51 IST|Sakshi
ప్లేబోయ్ భవంతిని అమ్మేశారట..!

లాస్ ఏంజెల్స్ : ప్లే బోయ్ భవంతి అమ్మకం అయి పోయిందట. 100 మిలియన్ డాలర్లకు పైగా ఈ భవంతిని ప్లే బోయ్ యజమాని హుగ్ హెఫ్నర్ అమ్మారట. ప్లే బోయ్ ఎంటర్ ప్రైజస్ కలిగి ఉన్న ఈ హాంబీ హిల్స్ ఎస్టేట్ ను, వారి ప్రాపర్టీకి పక్కనే నివసిస్తున్న డరెన్ మెట్రోపాలస్ కొనుగోలు చేశారట. 200 మిలియన్ డాలర్లకు ఈ ఎస్టేట్ ను హుగ్ మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. అయితే ఎంతకు అమ్ముతున్నారో మాత్రం ప్రకటించలేదు. 100 మిలియన్ డాలర్లకు పైగా మొత్తానికి ఈ భవంతి అమ్ముడు పోయినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

ఈ భవంతిని కొనుగోలు చేసిన డరెన్ కోటీశ్వరుడైన సీ. డీన్ మెట్రోపాలస్ కుమారుడు. ప్లే బోయ్ భవంతికి పక్కనే ఆయన 2009లో ఓ  భవంతిని 18 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన కొనుగోలు చేసిన ఈ భవంతిలో హుగ్ చనిపోయేంతవరకు అక్కడే నివసించేందుకు డరెన్ సమ్మతించినట్టు మెట్రోపాలస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ చారిత్రాత్మకమైన భవంతిని 1927లో ఆర్థర్ ఆర్. కెల్లీ డిజైన్ చేశారు. 5.3 ఎకరాల్లో ఈ భవంతి విస్తరించి ఉంది. 21,789 చదరపు అడుగుల గోథిక్-ట్యూడర్ స్లైల్ లో ఈ భవంతి ఉంది. ఇందులో మొత్తంలో 22 గదులుంటాయి. వాటిలో మద్యపాన గది, స్క్రీనింగ్ రూమ్, గేమ్స్ రూమ్, టెన్నీస్, బాస్కెట్ కోర్టు, వాటర్ ఫాల్, స్విమ్మింగ్ పూల్ ఏరియాను ఈ భవంతిలోనే ఉంటాయి. సెపరేట్ వింగ్ లో ప్లేబోయ్ మ్యాగజేన్ ఆఫీసు కూడా ఉంది.

మరిన్ని వార్తలు