13 వేల కోట్ల సమీకరణలో పీఎన్‌బీ

2 Jun, 2018 01:10 IST|Sakshi

హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటా విక్రయంసహా పలు యత్నాలు

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ కుంభకోణం దెబ్బ నుంచి కోలుకునే క్రమంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నిధుల సమీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయం, మొండి బాకీల రికవరీ తదితర మార్గాల్లో సెప్టెంబర్‌ ఆఖరు నాటికి రూ. 13,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ వ్యూహంలో భాగంగా పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటాలు విక్రయించాలని పీఎన్‌బీ యోచిస్తోంది.

ఈ సంస్థలో బ్యాంకుకు 39.08 శాతం వాటా ఉంది. అలాగే అటు న్యూఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లో ఉన్న ప్రాపర్టీని కూడా విక్రయించాలని పీఎన్‌బీ భావిస్తోంది. సుమారు రూ.14,000 కోట్ల నీరవ్‌ మోదీ కుంభకోణం నేపథ్యంలో... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పీఎన్‌బీ ఏకంగా రూ.13,417 కోట్ల మేర నష్టం ప్రకటించింది. ఈ పరిణామాలతో మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ గత నెలలో బ్యాంకు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ కూడా చేసింది.

మరిన్ని వార్తలు