పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

6 Nov, 2018 01:48 IST|Sakshi

పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓలో భాగంగా 24.64 శాతం వాటాకు సమానమైన 49.58 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ కంపెనీ భాగస్వామ్య సంస్థలు విక్రయిస్తాయి. దీంట్లో పీఎన్‌బీ 8 కోట్ల షేర్లను, మెట్‌లైఫ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీ 12.90 కోట్ల షేర్లను, ఎం పల్లోంజీ అండ్‌ కంపెనీ 10.76 కోట్ల షేర్లను, ఎల్‌ప్రో ఇంటర్నేషనల్‌ సంస్థ 7.66 కోట్ల షేర్లను, 7.65 కోట్ల షేర్లను జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌లు  విక్రయిస్తాయి.

ఈ ఐపీఓకు కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, డీఎస్‌పీ మెరిల్‌లించ్, సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, పీఎన్‌బీ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ వ్యవహరిస్తున్నాయి. కాగా స్టాక్‌ మార్కెట్లో ఇప్పటికే ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎప్‌సీ స్డాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు లిస్టయ్యాయి.

మరిన్ని వార్తలు