పోర్ష్‌ మకన్‌ కొత్త వేరియంట్‌

30 Jul, 2019 13:13 IST|Sakshi

ధరలు రూ.70 లక్షల నుంచి ఆరంభం  

వచ్చే మే కల్లా ఎలక్ట్రిక్‌ కారు టేకాన్‌  

న్యూఢిల్లీ: లగ్జరీ స్పోర్ట్స్‌ కార్ల కంపెనీ పోర్ష్‌  కంపెనీ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ, మకన్‌లో  కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరలు రూ.69.98లక్షల(ఎక్స్‌ షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతాయని అని పోర్ష్‌ ఇండియా తెలిపింది. భారత్‌లో అత్యధికంగా విజయవంతమైన మోడల్‌ ఇదేనని, ఈ కొత్త  వేరియంట్‌కు  కూడా మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని పోర్ష్‌ ఇండియా డైరెక్టర్‌ పవన్‌ శెట్టి చెప్పారు.  ఈ కారును 2–లీటర్ల  టర్బోచార్జ్‌డ్‌ నాలుగు సిలిండర్ల ఇంజిన్‌తో రూపొందించామని, 252 హార్స్‌పవర్‌ శక్తిని  ఈ ఇంజిన్‌ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని ఆరున్నర సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 227 కి.మీ. అని పేర్కొన్నారు. ఈ మోడల్‌లో హై ఎండ్‌ వేరియంట్, మకన్‌ ఎస్‌ను కొత్త వీ6 ఇంజిన్‌తో రూపొందించామని, 354 హార్స్‌పవర్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుందని వివరించారు. ఈ కారు ధర రూ.85.03 లక్షలని తెలిపారు. గత ఏడాది మొత్తం 348 కార్లను విక్రయించామని, ఈ ఏడాది కూడా అమ్మకాలు ఇదే రేంజ్‌లో ఉండగలవని పేర్కొన్నారు.   

4 నిమిషాల్లోనే చార్జింగ్‌..  
వచ్చే ఏడాది మే కల్లా ఎలక్ట్రిక్‌ కారు, టేకాన్‌ను భారత మార్కెట్లోకి తెస్తామని పవన్‌ శెట్టి తెలిపారు.  ఇతర పోర్ష్‌ కార్ల మోడళ్లలాగే ఈ కారును కూడా పూర్తిగా తయారైన రూపంలోనే దిగుమతి చేసుకుంటామని చెప్పారు. ఈ కారు బ్యాటరీలను నాలుగు నిమిషాల్లోనే చార్జింగ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్లను చార్జింగ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించడానికి భారత్‌లోని ఫైవ్‌–స్టార్‌ హోటళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. కాగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతానికి, చార్జర్లపై పన్ను రేట్లను 18 శాతం నుంచి 5 శాతానికి  తగ్గించడాన్ని ఆయన స్వాగతించారు. ఇది సానుకూల నిర్ణయమని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్‌

కంపెనీల వేటలో డాక్టర్‌ రెడ్డీస్‌

ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులోకి అమెజాన్‌

గ్లోబల్‌ టాప్‌ సీఈఓల్లో అంబానీ

మార్కెట్లోకి ‘బిగ్‌బాస్‌’?

ఫిక్స్‌డ్ డిపాజిట్లు : ఎస్‌బీఐ బ్యాడ్‌ న్యూస్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు కీలక ఆదేశాలు

ఇండియా బుల్స్‌ షేర్లు ఢమాల్‌

నష్టాలే : 11200 దిగువకు నిఫ్టీ

నష్టాల్లో మార్కెట్లు, మెటల్‌, ఆటో  వీక్‌

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు షాక్‌

మీ లక్ష్యాలకు గన్ షాట్‌

చపాతీ ఇలా కూడా చేస్తారా? నేనైతే ఇంతే!!

ఫండ్స్‌.. పీఎమ్‌ఎస్‌.. ఏది బెటర్‌?

రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం..

ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్‌ దృష్టి!

ఐసీఐసీఐ లాభం 1,908 కోట్లు

ఐపీవో బాటలో గ్రామీణ బ్యాంకులు

అమ్మకాలతో స్టాక్‌ మార్కెట్‌ డీలా

దేశీయంగా తగ్గనున్న డిమాండ్‌ 

ఇ‘స్మార్ట్‌’ పాలసీ..!

ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌!

వొడాఫోన్‌ ఐడియా నష్టాలు 4,874 కోట్లు

కంపెనీల రవాణా సేవలకు ‘విజిల్‌’

లాభాల్లోకి పీఎన్‌బీ

ఊహించినట్టుగానే జీఎస్‌టీ తగ్గింపు

జియో జైత్రయాత్ర

మారుతీ లాభం 32 శాతం డౌన్‌

విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?